Nara Lokesh: చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!
రాజమండ్రి సెంట్రల్ జైల్లో (rajamundry central jail) చంద్రబాబు నాయుడుకి (chandrababu naidu) ప్రాణ హాని ఉందని.. ఆయనకు స్టెరాయిడ్స్ ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు నారా లోకేష్ (nara lokesh). ఆయనకు కావాలనే హాని తలపెట్టాలని చూస్తున్నారని జైల్లో చంద్రబాబుకు ఏదన్నా జరగరానిది జరిగితే జగన్ ప్రభుత్వానిదే బాధ్యత అని ట్వీట్ చేసారు. జైల్లో దోమలు, కలుషిత నీరు కారణంగా డీహైడ్రేట్ అయిపోయి బరువు తగ్గిపోయారని, వివిధ అలెర్జీలతో బాధపడుతున్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వం, వైద్యాధికారులు ఏదో దాచాలని ప్రయత్నిస్తున్నారిని ఆయనకు ఏమన్నా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. (nara lokesh)