Mudragada: పవన్.. నాకు మీలా గ్లామర్ లేదు కానీ..
Mudragada: సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం.. జనసేనాని పవన్ కళ్యాణ్‌కు (Pawan Kalyna) ఓ లేఖ రాసారు. ఆ లేఖలో తన ఆవేదనను వెళగక్కారు. ఇంతకీ లేఖలో పద్మనాభం ఏమని రాసారంటే..
2019 ఎన్నికల ముందు కవాతు సందర్భంగా కిర్లంపూడి వస్తానని కబురు పంపారు. అయోధ్య వెళ్లొచ్చిన తర్వాత కిర్లంపూడి వస్తానని మరోసారి కబురు పంపించారు. ఎటువంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పాను. అన్ని వర్గాలకు న్యాయం జరగడం కోసం పార్టీని ముందు తీసుకెళ్లడానికి నా వంతు కృషి చేయాలని, ఎటువంటి ఫలితం ఆశించని సేవ మీతో చేయాలని అనుకున్నానండి.
మన ఇద్దరి కలయిక జరగాలని యావత్ జాతి చాలా బలంగా కోరుకున్నారండి. వారి అందరి కోరిక మేరకు నా గతం, నా బాధలు, అవమానాలు, ఆశయాలు, కోరికలు అన్నీ మరిచి మీతో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డానండి. రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ ఒరవడి తీసుకురావాలని చాలా బలంగా ప్రయత్నం చేద్దామని ఆశించానండి. మీరు అదే ఆలోచనలో ఉన్నారని నమ్మానండి. కానీ దురదృష్టవశాత్తు నాకు మీరు ఆ అవకాశం ఇవ్వలేదండి. (Mudragada)
చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు మొత్తం తెలుగు దేశం పార్టీ కేడర్ బయటికు రావడానికి భయపడి ఇంచుమించుగా ఇళ్లకే పరిమతం అయిపోయారు. అటువంటి కష్టకాలంలో తమరు జైలుకి వెళ్లి వారికి భరోసా ఇవ్వడం అనేది సామాన్యమైన విషయం కాదు, చరిత్ర తిరగాసినట్లు అయ్యింది. వారి పరపతి విపరీతంగా పెరగడానికి ఎవరు ఎన్ని చెప్పినా మీరే కారకులని బల్ల గుద్ది చెప్పగలను. ప్రజలు ఇంచుమించుగా అందరూ మిమ్మల్ని ఉన్నత స్థానంలో చూడాలని తహతహలాడారు. పవర్ షేరింగ్ కోసం ప్రయత్నం చేసి అసెంబ్లీ సీట్లు 80, రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ముందుగా మిమ్మల్ని చేయమని కోరి ఉండాలి. ఆ సాహసం మీరు చేయలేకపోవడం చాలా బాధాకరం.
40 సంవత్సరాల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం కానీ, పదవుల కోసం పెద్ద గాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం కానీ చేయలేదు. భగవంతుడిని ఆ పరిస్థితి రాకుండా చేయమని తరచూ కోరుకుంటాను. కానీ మీలాగ గ్లామర్ ఉన్నవాడిని కాకపోవడం, ప్రజల్లో పరపతి లేనివాడిని అవ్వడం వల్ల మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా తుప్పు పట్టిన ఇనుము లాంటి వాడిగా గుర్తింపు పడటం వల్ల మీరు వస్తానని చెప్పించి రాలేకపోయారు. మీ నిర్ణయాలు మీ చేతల్లో ఉండవు, ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాలి. మీ పార్టీ పోటీ చేసే 24 మంది కోసం నా అవసరం రాదు, రాకూడదని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ అని పేర్కొన్నారు ముద్రగడ.