Yasho Bhoomi: భారత్లోనే మరో అతిపెద్ద ఎక్సో సెంటర్..ప్రత్యేకతలివే..!
భారత ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) తన పుట్టినరోజును పురస్కరించుకుని ఈరోజు భారత్లోనే మరో అతిపెద్ద ఎక్స్పో, కన్వెన్షన్ సెంటర్ అయిన యశోభూమిని (yasho bhoomi) ప్రారంభించారు. ఈ యశో భూమి ప్రత్యేకతలు ఏంటో చూద్దాం.
*ఈ యశో భూమి సెంటర్ ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో ఉంది.
*మన భారత్లో ఉన్న రెండో అతిపెద్ద ఎక్స్పో సెంటర్ ఇదే. మొదటిది భారత మండపం. ఇది కూడా ఢిల్లీలోనే ఉంది. మొన్న జీ20 సమ్మిట్ ఇక్కడే జరిగింది. (yasho bhoomi)
*రూ.5400 కోట్లతో ఈ యశో భూమిని నిర్మించారు.
*8.9 లక్షల చదరపు గజాల్లో ఇది విస్తరించి ఉంది.
*ఈ సెంటర్లో 11000 మంది డెలిగేట్లు ఒకే దగ్గర కూర్చునే కెపాసిటీ ఉంది. 15 కన్వెన్షన్ గదులు, భారీ బాల్రూం, 13 సమావేశ గదులు ఉన్నాయి. (yasho bhoomi)
*భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా ఈ యశో భూమి డిజైన్లు ఉన్నాయి.
*న్యూ ఢిల్లీ నుంచి యశో భూమికి మెట్రోలో 21 నిమిషాల్లో చేరుకోవచ్చు.
*దాదాపు 8 ఫ్లోర్లలో 13 సమావేశ గదులను ఏర్పాటుచేసారు.
*గ్రాండ్ బాల్రూంలో 2,500 మంది అతిథులకు సరిపోయే సామర్ధ్యం ఉంది.
*ఈ కన్వెన్షన్ సెంటర్ ఓపెన్ ఏరియాలో 500 మందికి సరిపోయే ప్రదేశం ఉంది.
*చెక్కతో డిజైన్ చేసిన గోడలు చూడగానే విజిటర్లు మంత్రముగ్దులు కావాల్సిందే