Dharmana Vs Subba Reddy: రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు (Dharmana Prasad Rao) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఉత్తరాంధ్రలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) కుటుంబ భూ కబ్జాలను ధర్మాన నిర్ధారించారు. YSRCP నేత వైవీ సుబ్బారెడ్డిపై పారేసుకున్నట్లు తెలుస్తోంది. పక్క జిల్లాల నుంచి వచ్చి పెత్తనం చెలాయిస్తున్నారని షాకింగ్ వ్యాఖ్యలు చేసారు. కడప నుంచి వచ్చిన రెడ్లు పెత్తనం చెలాయిస్తామంటే చూస్తూ ఊరుకోను అంటూ ధర్మాన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అధికార పార్టీ చేస్తున్న భూకబ్జాల వెనుక సొంత పార్టీ నాయకులే ఉన్నారని వస్తున్న ఆరోపణలను బలపరిచినట్లు అయ్యింది.
అయితే..ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసారు అనేదానిపై జిల్లాల్లో తీవ్రమైన చర్చకు దారి తీసింది. ఇటీవల కాలంలో వైవీ సుబ్బారెడ్డి అనే వ్యక్తి తన వద్దకు వచ్చి అప్పనంగా భూమి కబ్జా చేస్తానంటే తాను తంతా పో అని ధర్మాన చెప్పారట. ప్రధానంగా ఒక ప్రజా ప్రతినిధిగా ఉండి ఇతరుల సొమ్ము కాజేస్తామంటూ చూస్తూ ఊరుకోవడం మంచిది కాదు. దీనిలో భాగంగానే సుబ్బారెడ్డి అనే వ్యక్తిని పొమ్మని చెప్పానని ధర్మాన అన్నారు. ఇతర జిల్లాలకు చెందిన వ్యక్తులు శ్రీకాకుళంలో పెత్తనం చేస్తానంటే చూస్తూ ఊరుకోనని అన్నారు. ప్రజా ప్రతినిధులకు ఆస్తి కోసం కక్కుర్తి పడే మనస్తత్వం ఉండకూడదని సూచించారు. వచ్చిన వారు ఏ పార్టీ వారని కూడా చూడనని.. ఇక్కడికి వచ్చి ఆజమాయిషీ చలాయిస్తానంటే అది తనను అవమానించినట్లే అని అన్నారు. జిల్లాల్లో పెద్ద ఎత్తున వనరులు ఉండడంతో పక్క జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నారన్న ధర్మాన ఇలాంటి సంస్కృతిని ఇలాగే వదిలేస్తే అధికారం రౌడీల చేతుల్లోకి వెళ్లిపోతాయని అన్నారు. (Dharmana Vs Subba Reddy)
ఇలాంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో తీవ్ర చర్చ జరుగుతోంది. తాను మంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళంకు ఎంతో అభివృద్ధి జరిగిందని అన్నారు. జిల్లాలో అలాంటి కల్చర్‌ను ఎంకరేజ్ చేయకుండా చూడటమే తన బాధ్యత అని ధర్మాన తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేసారు. అధికార పార్టీకి సంబంధించిన ఇతర నేతలకు సంబంధించిన నేతలు భూకబ్జాలకు పాల్పడుతున్నారు అనే ఆరోపణలు వస్తున్నారు. అందుకే ధర్మాన ఇలాంటి వ్యాఖ్యలు చేసారు అనే చర్చ జరుగుతోంది.
శ్రీకాకుళం జిల్లాలో ఓ నియోజకవర్గ వైసీపీ ప్రజాప్రతినిధి కుటుంబం భూకబ్జాలు, సెటిల్మెంట్లతో చెలరేగుతోంది. రాకరాక వచ్చిన అధికారంతో ఆ ప్రజాప్రతినిధి దోపిడీలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. గత సార్వత్రిక ఎన్నికలప్పుడు ఖర్చుల కోసం అమ్మిన నాలుగు ఎకరాలు తిరిగి లాక్కోవడం ద్వారా ఆయన అరాచకపర్వం ఆరంభించారు. భూమి కొనుగోలుదారుల్ని పిలిపించి తన భూమి తనకు వెనక్కి ఇస్తారా? కేసులు పెట్టించమంటారా? అని భయపెట్టారు. ఎందుకొచ్చినగొడవంటూ కొనుగోలుదారులు నామమాత్రపు డబ్బు తీసుకుని ఆ భూమి పత్రాలు ప్రజాప్రతినిధికి తిరిగి ఇచ్చి వెళ్లిపోయారు.
నియోజకవర్గ కేంద్రంలోని ప్రఖ్యాత మఠం భూములపైనా ఆయన కన్నుపడింది. 300 ఎకరాల మఠం భూముల్లో కొంత భాగం పలువురు స్థిరాస్తి వ్యాపారులు ఇతర వ్యక్తుల చేతుల్లో ఉంది. ఆ ప్రజాప్రతినిధి సంబంధిత వ్యక్తుల్ని పిలిపించారు. తనకు 25 శాతం వాటా ఇవ్వాలంటూ అల్టిమేటం ఇచ్చారు. ఆయనతో వేగలేక కొందరు దండం పెట్టేశారు. 3ఎకరాలను 10కోట్ల రూపాయలకే ముట్టజెప్పారు. అక్కడ ఎకరా 10 కోట్ల రూపాయలపైనే పలుకుతుండడంతో తమ వాటా ఇవ్వటానికి కొందరు నిరాకరించారు. నేను అడిగిందే కాదంటారా అని స్థలం ఇవ్వని వారి అపార్ట్మెంట్లకు కరెంటు కట్ చేయించి తన ప్రతాపం చూపించారు. తన చేతికి మట్టి అంటకుండా చేసే అరాచకాలకూ అంతేలేదు.