USA Elections: కమలా హ్యారిస్ గెలవాలంటున్న మెలానియా ట్రంప్!
USA Elections: నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ అభ్యర్ధులుగా నిలబడ్డారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బెడైన్‌తో పాటు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పాటు ఇతర నేతల మద్దతు కూడా కమలా హ్యారిస్‌కే ఉంది. అయితే.. డొనాల్డ్ ట్రంప్‌కి బయటి వారు ఎంత మద్దతు తెలుపుతున్నారో తెలీదు కానీ.. భార్య మెలానియా మాత్రం తన మద్దతు కమలా హ్యారిస్‌కే అని అన్నారట. ఈ విషయాన్ని వైట్ హౌస్ మాజీ ప్రజా ప్రతినిధి ఆంటోనీ స్కారాముచ్చి మీడియా ద్వారా వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. బయటికేమో భర్త డొనాల్డ్‌కే మద్దతు తెలుపుతున్న మెలానియా సీక్రెట్‌గా మాత్రం కమలా హ్యారిసే గెలవాలని అంటున్నారని తెలిపారు. అందుకే డొనాల్డ్ ట్రంప్ ప్రచారాలకు కూడా మెలానియా హాజరుకావడంలేదని అన్నారు. మెలానియాకు ట్రంప్ అంటే అసహ్యమని.. తన భార్యకు కూడా ట్రంప్ అంటే నచ్చదని తెలిపాడు. ఆంటోనీ వ్యాఖ్యలు దుమారానికి దారితీసాయి.