KTR: ఏపీలో ఏం జరిగిందో చూసారుగా.. మీ గతీ అంతే
KTR: తెలంగాణలో అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాంటి అధికారులకు తాను ఒకటే చెప్పదలచుకున్నానని.. మొన్న ఆంధ్ర ప్రదేశ్లో ఏం జరిగిందో చూడండి.. అల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు కూడా మొన్న సస్పెండ్ అయ్యారు అంటూ హెచ్చరించారు. చట్టం ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అంటే తప్పకుండా దానికి ఫలితం అనుభవిస్తారంటూ వార్నింగ్ ఇచ్చారు.
జగన్ మోహన్ రెడ్డి పాలనలో కొందరు పోలీసు అధికారులు తెలుగు దేశం పార్టీ నేతలను ఇబ్బందులు పెట్టారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక వారందరిపై వేటు వేసారు. ఇప్పుడు ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ తెలంగాణలో పనిచేస్తున్న కొందరు అధికారులు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.