మ‌హారాష్ట్ర రాజ‌కీయాల‌పై KTR ఫ‌న్నీ కామెంట్

Hyderabad: మ‌హారాష్ట్ర‌లో జ‌రుగుతున్న మ‌హా డ్రామాపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTR ఫ‌న్నీ కామెంట్స్ చేసారు. నిన్న నేష‌నలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ncp) నేత అజిత్ ప‌వార్ (ajit pawar) సొంత గూటి నుంచి మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంతో (maharashtra politics) చేతులు క‌ల‌పడానికి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. దాంతో NCP చీలిపోయింది. అజిత్ ప‌వార్.. మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసారు. దీని వెనుక BJP హ‌స్తం ఉంద‌ని అంద‌రికీ తెలిసిందే. మ‌హారాష్ట్ర‌లో BJP చీల్చిన రెండో పార్టీ NCP. గ‌తంలో శివ‌సేన నుంచి కూడా కొంద‌రు రెబెల్స్ బ‌య‌టికి వ‌చ్చి స‌ప‌రేట్‌గా ఫ్యాక్ష‌న్ శివ‌సేన పార్టీ పెట్టారు. దీనికి లీడ‌ర్ ఇప్పుడున్న మ‌హారాష్ట్ర సీఎం ఏక‌నాథ్ శిండే. ఇప్పుడు NCPని చీల్చి అజిత్ ప‌వార్‌ను ద‌క్కించుకున్న నేప‌థ్యంలో ఏక‌నాథ్ స్పందిస్తూ.. మొన్న‌టి వ‌ర‌కు డ‌బుల్ ఇంజిన్‌గా ఉన్న గ‌వ‌ర్న‌మెంట్ ఇప్పుడు అజిత్ రాక‌తో ట్రిపుల్ ఇంజిన్ అయ్యింది అన్నారు. దీనిపై KTR స్పందిస్తూ.. డ‌బుల్ ఇంజిన్స్ ఎప్పుడో కాలం చెల్లిపోయాయి. ఇప్పుడు వాషింగ్ మెషీన్లు న‌డిపే ట్రిపుల్ ఇంజిన్లు వ‌చ్చాయి అని ఫ‌న్నీ ట్వీట్ పెట్టారు.