Kodali Nani: హీరోయిన్లు గెలిచారు కానీ ప‌వ‌న్ ఓడిపోయాడు

AP: జ‌న‌సేన (janasena) పార్టీ పెట్టి ప్ర‌జ‌ల్లో తిరుగుతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) కేవ‌లం అసెంబ్లీలో అడుగుపెట్ట‌డానికే అని బాగా అర్థ‌మ‌వుతోందని మ‌రోసారి కామెంట్స్ చేసారు YCP ఎమ్మెల్యే కొడాలి నాని (kodali nani). ఆయ‌న నియోక‌వ‌ర్గంలో టిడ్కో ఇళ్లు నిర్మించ‌డానికి జ‌గ‌న్ (ap cm jagan) ప్ర‌భుత్వం కొన్ని వేల కోట్లు మంజూరు చేసినందుకు థ్యాంక్స్ చెప్తూ ప‌నిలో ప‌ని ప‌వన్ క‌ళ్యాణ్ గురించి కూడా ప్ర‌స్తావించారు. “మొన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌గ‌న్ అన్న‌కు ఓ ఛాలెంజ్ విసిరారు. అసెంబ్లీలోకి అడుగుపెడితే ఎవ‌డు ఆపుతాడో చూస్తా అని. మొత్తానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీ పెట్టింది అసెంబ్లీలోకి అడుగుపెట్ట‌డానికే అని అర్థ‌మ‌వుతోంది. ఇందుకోస‌మే టీడీపీతో పొత్తుకు సిద్ధ‌మ‌య్యారు. న‌వ‌నీత్ కౌర్, సుమ‌ల‌త లాంటి హీరోయిన్లు ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఎంపీలుగా గెలిచారు కానీ ప‌వ‌న్ మాత్రం సొంతంగా పోటీ చేయ‌లేక ఓడిపోతున్నాడు” అంటూ విమ‌ర్శించారు నాని.