Exit Polls: ఈ సర్వే వేరే లెవెల్.. జనసేనకు 21కి 21
Exit Polls: సర్వేల యందు ఈ సర్వేలు వేరగా అన్నట్లుంది కేకే సర్వే. ఈ కేకే అనే ఎనలిస్ట్ జనసేనాని పవన్ కళ్యాణ్‌కి అభిమానేమో అన్నట్లుగా ఉంది ఆయన ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ సర్వే. జనసేన పోటీ చేసిన మొత్తం 21 సీట్లకు గానూ 21 గెలిచేలా ఉందని చెప్తున్నారు. ఇది నిజంగా షాకింగ్ విషయమనే చెప్పాలి. ఎందుకంటే 21లో కనీసం 15 కొట్టినా చాలు ఆంధ్రప్రదేశ్‌లో జనసేన అనేది ఓ ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉంటుంది అని జనసేన నేతలు అనుకుంటున్నారు. అలాంటి సమయంలో కేకే వచ్చి 15 కాదు మొత్తం 21 గెలుస్తారు అని చెప్పడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఏదేమైనా అసలు ఫలితాలు జూన్ 4న వెలువడితే కానీ ఏమీ చెప్పలేం. ఈ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఇలా ఉండబోతున్నాయి.
TDP – 133/144
జనసేన- 21/21
BJP – 07/10
YSRCP – 14/175