EXCLUSIVE: TDPకి రాజీనామా?
EXCLUSIVE: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల (ap elections) సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ కేశినేని నానికి (kesineni nani) పెద్ద షాక్ ఇచ్చింది. ఈసారి విజయవాడ నుంచి పోటీ చేసేందుకు వీల్లేదని తేల్చి చెప్పేసింది. ఆ స్థానంలో వేరొకరిని నిలబెట్టనుంది. ఇక విజయవాడకు సంబంధించి ఏ అంశాల్లోనూ జోక్యం చేసుకోకూడదు అని కూడా తెలుగు దేశం పార్టీ నానికి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో నాని పార్టీకి రాజీనామా చేయాలనుకుంటున్నారు. YSRCP విప్ సజ్జల రామకృష్ణారెడ్డితో కూడా టచ్‌లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో కేశినేని ఇంటికి ఆయన అనుచరులు వస్తున్నారు. వారితో చర్చించి ఇంకో రెండు రోజుల్లో ఆయన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.