Ravi Teja: టాలీవుడ్ కోసం వెన‌క‌డుగు వేస్తున్నా

Ravi Teja: మాస్ మహారాజా ర‌వితేజ న‌టించిన ఈగల్ (eagle) సినిమా సంక్రాంతి రేస్ నుంచి ప‌క్క‌కు త‌ప్పుకుంది. ఈ సినిమా జ‌న‌వ‌రిలోనే రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ ఇత‌ర సినిమాలు కూడా సంక్రాంతి బ‌రిలో ఉన్నందున ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రికి పోస్ట్ పోన్ వేసారు. దీనిపై ర‌వితేజ స్పందిస్తూ.. టాలీవుడ్ కోసం తాను వెన‌క‌డుగు వేస్తున్నాన‌ని రావ‌డంలోనే చిన్న మార్పు ఉంది కానీ టార్గెట్ రీచ్ అవ్వ‌డంలో కాద‌ని అన్నారు. దీనిపై ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంకర్ (harish shankar) స్పందిస్తూ.. ఆయ‌న మాస్ మ‌హారాజా మాత్ర‌మే కాదు.. మ‌న‌సున్న మారాజు కూడా అని కామెంట్ చేసారు.