Kesineni Nani: TDP మెడపట్టి గెంటింది.. జగన్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా
Kesineni Nani: తెలుగు దేశం పార్టీ (TDP) తనను మెడపట్టి గెంటితే.. YSRCP పార్టీ తనను ఆలింగనం చేసుకుని మరీ పార్టీలోకి ఆహ్వానించిందని అన్నారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. తనకు విజయవాడ ఎంపీ టికెట్ ఇచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డికి (jagan mohan reddy) తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని పార్టీకి రుణ పడి ఉంటానని తెలిపారు.
“” చంద్రబాబు నాయుడుది సింగిల్ పాయింట్ ఎజెండా. లోకేష్‌ను సీఎం చేయాలనుకుంటున్నారు తప్ప మరో ఎజెండా లేదు. 2014 నుంచి 2019 వరకు విజయవాడ ఎంపీగా ఉన్నాను. ఒక రూ.100 కోట్లు విజయవాడకు ఇచ్చారా అని అడిగాను. కేంద్ర ప్రభుత్వం నేను ఇచ్చిన ఫండ్స్ తప్ప మీరేమైనా ఇచ్చారా అని చంద్రబాబును ప్రశ్నించాను. చాలా మంది అమరావతి కడుతున్నారని ప్రజలు అపోహలో ఉన్నారు. అమరావతిని ఎలా డెవలప్ చేస్తారో తెలీదు కానీ విజయవాడను స్మశానం చేయాలనుకుంటున్నారు. విజయవాడను ఓల్డ్ సిటీగా చేయాలనుకుంటున్నారు.
ఆయనకు విజయవాడ ప్రజలంటే చిన్న చూపు. 5000 ఎకరాల్లో అమరవాతిలో ఎయిర్‌పోర్ట్ పెట్టాలనుకున్నారు. విజయవాడలో వద్దు అన్నప్పుడు నేను ఎదురుతిరిగాను. అప్పట్లో వెంకయ్య నాయుడు ద్వారా ఒప్పిస్తే కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఇచ్చింది. నేను రాజధానికి వ్యతిరేకిని కాదు. “” అని విమర్శించారు.