Bommai: మోదీ వ‌చ్చినా.. గెల‌వ‌లేక‌పోయాం

Bengaluru: క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో(karnataka elections) గెల‌వ‌లేక‌పోయామ‌ని ప్ర‌స్తుత క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి, BJP నేత బ‌స‌వ‌రాజు బొమ్మై(bommai) అన్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ(modi) క‌ర్ణాట‌క‌లో రోడ్ షో చేసిన‌ప్ప‌టికీ ఫలితం లేకుండా పోయింద‌ని తెలిపారు. కౌంటింగ్ జ‌రుగుతున్నంత సేపు గెలుపు మాదే అంటూ ధీమా వ్య‌క్తం చేసిన బొమ్మై.. ఇప్పుడు ప్ర‌జ‌ల నిర్ణాయ‌న్ని గౌర‌విస్తామ‌ని అన్నారు. క‌ర్ణాట‌క‌లో 38 సంవ‌త్స‌రాలుగా ఉన్న ట్రెండ్ ఇప్పటికీ కొన‌సాగుతోంది. క‌ర్ణాట‌క‌లో వ‌రుస‌గా రెండోసారి ఏ ప్ర‌భుత్వ‌మూ గెల‌వ‌లేదు. ఇప్పుడు కూడా అదే జ‌రిగింది.