karnataka elections: కులగణన వెనుక రాహుల్‌ ప్లాన్ ఇదే!

bengaluru: కర్నాటక ఎన్నిక(karnataka elections)లు దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్‌ గాంధీ(rahul gandhi) అనేక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇదే క్రమంలో రెండు విషయాలను గట్టిగా నొక్కి చెబుతున్నారు. అవేమిటంటే ఒకటి.. కాంగ్రెస్‌ పార్టీ(congress party) అధికారంలోకి వస్తే.. కులగణన(caste based census) చేపడతామని, అదేవిధంగా ఓబీసీ రిజర్వేషన్‌ను 50 శాతానికంటే ఇంకా పెంచుతామని వాగ్దానాలు ఇస్తున్నారు. మరి ఈ రెండు ఆచరణలో సాధ్యమైనా.. రాహుల్‌ వ్యూహం ఏంటి? అన్నదానిపై కథనం.

రాహుల్‌ అధికారంలోకి వస్తే కుల జనగణన జరుపుతామని చెబుతున్నారు. ఇది బీజేపీని కర్నాటకతోపాటు, దేశంలో ఎదుర్కొనేందుకు ఆయన ఒక మార్గంగా ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఈ కులగణన ఎందుకు జరుపుతున్నారంటే.. బీసీలు, ఎస్సీలు, ఇతర సామాజిక వర్గాల్లో ఎవరైతే రాజ్యాధికారం సాధించని వారు.. పేదరికంలో ఉన్నారో.. వారి వివరాలను తెలుసుకోవడం. వారికి ఎలాంటి పథకాలు అందిస్తే వృద్ధిలోకి వస్తారు అన్నదానిపై ఈ సర్వేలు చేపడుతుంటారు. దీన్ని మండల్ సర్వే అని కూడా అంటారు. ఇటీవల సీఎం స్టాలిన్‌(stalin) కూడా కులగణన చేపట్టాలన్నారు. బీహార్‌లో నితీష్‌ ప్రస్తుతం జరుగుతోంది. బీజేపీ హిందూ సామాజిక న్యాయం అంశాన్ని ముందుకు తెస్తుండగా.. కాంగ్రెస్‌, పలు పార్టీలు సామాజిక వర్గీకరణపై దృష్టి సారించాయి. వాస్తవానికి దీని వల్ల యూపీ, బీహార్‌లలో యాదవులకు రాజ్యాధికారం దక్కింది.

రెండో అంశం.. ఓబీసీ రిజర్వేషన్లు 50 శాతానికంటే పెంచుతాం అంటున్నారు రాహుల్‌. అయితే దీనికి సుప్రీంకోర్టు గతంలోనూ అనేక పర్యాయాల్లో అనుమతి ఇవ్వలేదు. రిజర్వేషన్లు పెంచడం ద్వారా.. రాజ్యాంగంలో సమానత్వం, సామాజిక సూత్రం, పౌర పాలనలో సామర్థ్యం ఈ మూడింటిలో సమానత్వ పోతుంది అన్నది సుప్రీంకోర్టు వాదన. కాబట్టి రిజర్వేషన్‌ పెంచే అంశాన్ని అంత సులువుగా అంగీకరించకపోవచ్చు. ఇక సామాజిక సమీకరణాల ప్రయోగం కాంగ్రెస్‌ను గెలిపిస్తుందా.. లేదా మందిర్‌ పాలిటిక్స్‌ బీజేపీని గద్దెనెక్కిస్తాయో తెలియాంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.