Kadiyam Srihari: నేను కాంగ్రెస్‌లోకి వెళ్తే BRSకి భయమెందుకు?
Kadiyam Srihari: కాంగ్రెస్ తన వద్దకు వచ్చి పార్టీలోకి ఆహ్వానించిందని.. తన కుమార్తెకు ఎంపీ టికెట్ ఇస్తామనడంతో పార్టీలో చేరేందుకు ఒప్పుకున్నామని అన్నారు స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఈ నేపథ్యంలో తన కార్యకర్తలను పార్టీ మారుదామా లేదా అని అడగ్గా… మారాల్సిందే.. BRS పార్టీలోనే వుంటే కార్యకర్తలకు, నియోజకవర్గ అభివృద్ధి చేసుకోలేమని కార్యకర్తలు అన్నారు.
తాను పార్టీ మారుతున్నానంటే BRS పార్టీకి భయం ఎందుకు అని ప్రశ్నించారు. పసునూరి దయాకర్, ఆరూరి రమేష్ పార్టీ మారితే లేని అభ్యంతరం తన విషయంలో BRS ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తోందని అన్నారు. తెలంగాణ ఉద్యమ కారులకు KCR చేసింది ఏమీ లేదని.. ఒక్కరోజు KCR కానీ KTR కానీ ఉద్యమకారులను దగ్గరికి రానిచ్చిన పాపాన పోలేదని మండిపడ్డారు.