మైత్రి మూవీ మేకర్స్‌పై ఐటీ రైడ్లు.. జనసేన నేత పనే!
Hyderabad: ఇటీవల ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌పై(mythri movie makers) ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఐటీ దాడుల వెనక జనసేన(janasena) పార్టీ నేత మూర్తి యాదవ్(murthy yadav) ఉన్నారని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ట్యాక్సులు ఎగ్గొట్టిందని, అందులో BRS నేత తలసాని శ్రీనివాస్, వైYCP నేత బాలినేని శ్రీనివాస్ పెట్టుబడులు పెట్టారని ఐటీ అధికారులకు మూర్తి సమాచారం ఇచ్చారట. ఈ నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్‌పై దాడులు జరిగాయి. దాడులు జరిగిన మరుసటి రోజే సంస్థ యజమాని నవీన్ యెర్నేరి(naveen yerneni) అస్వస్థతకు గురయ్యారు. అయితే జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్(pawan kalyan).. మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్(ustaad bhagat singh) సినిమా చేస్తున్నారు. పార్టీ అధినేత సినిమా చేస్తున్న సంస్థపై అదే పార్టీలోని మరో నేత ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.