Jagan: రుణ‌మాఫీ చేద్దామా?

Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో మేం సిద్ధం పేరిట ప్ర‌చార కార్యక్ర‌మాలు నిర్వ‌హిస్తున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. ప్ర‌స్తుతం సిద్ధం యాత్ర‌ల‌కు కాస్త బ్రేక్ ఇచ్చారు. ఈ గ్యాప్‌లో మేనిఫెస్టోపై ఫోక‌స్ చేయ‌నున్నారు. పార్టీ పెద్ద‌లు సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, విజ‌య సాయి రెడ్డిల‌తో పాటు మ‌రికొంద‌రు కీల‌క నేత‌ల‌తో మేనిఫెస్టోను రూపొందించే అంశంపై స‌ల‌హాలు అడిగి తెలుసుకుంటున్నారు.

అయితే ఈసారి ఎలాగైనా గెలిచి తీరాల్సిందే అన్న ప‌ట్టుద‌లతో ఉన్న జ‌గ‌న్.. ఏపీ రాష్ట్రానికి సాధ్యం కాని రైతుల రుణ మాఫీ ప‌థ‌కాన్ని మేనిఫెస్టోలో పెట్టాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మ‌రింత లోతుగా పెద్ద‌ల‌తో జ‌గ‌న్ చ‌ర్చిస్తున్నారు. 2019 కంటే ముందు జ‌గ‌న్ ఓడిపోయింది ఈ రైతు రుణ‌మాఫీ ఇవ్వ‌క‌పోవ‌డం వ‌ల్లే అని.. దానిని తెలుగు దేశం పార్టీ ప్ర‌క‌టించ‌డంతో చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి అయ్యార‌న్న టాక్ కూడా ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం క్లిక్ చేయండి