Netanyahu: నస్ర‌ల్లాను హ‌తం చేయ‌మ‌ని చెప్పింది నేనే

i ordered to kill nasrallah says netanyahu

Netanyahu: హెజ్‌బొల్లా అధినేత హ‌స్స‌న్ న‌స్రల్లాను హ‌తం చేయ‌మ‌ని ఆదేశాలు జారీ చేసింది తానేన‌ని అన్నారు ఇజ్రాయెల్ ప్ర‌ధాన మంత్రి బెంజిమ‌న్ నేత‌న్యాహు. న‌స్ర‌ల్లాను ఇంకా బ‌త‌క‌నిస్తే హెజ్‌బొల్లాను త్వ‌ర‌గా నిర్మించుకోగ‌ల‌డ‌ని అందుకే చంపేయ‌మ‌ని చెప్పాన‌ని అన్నారు. ఇజ్రాయెల్ చేసిన ప‌ని ప‌ట్ల ర‌ష్యా గుర్రుగా ఉంది. ఇది మ‌రో రాజ‌కీయ హ‌త్య‌గా సంబోధించింది. దీని వ‌ల్ల లెబ‌న‌న్ ఇత‌ర మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని ర‌ష్యా హెచ్చ‌రించింది. న‌స్ర‌ల్లాను చంపితే ఉండే రిస్క్ ఇజ్రాయెల్‌కి తెలిసీ ఈ ప్లాన్ వేసింద‌ని ర‌ష్యా ఆరోపించింది. దీని వ‌ల్ల యుద్ధాలు పెర‌గ‌డ‌మే త‌ప్ప శాంతి అనేది ఉండ‌ద‌ని హెచ్చ‌రించింది.