Bonda Uma: బోండా ఉమ అరెస్ట్? విజయవాడలో హైటెన్షన్
Bonda Uma: తెలుగు దేశం పార్టీ నేత బోండా ఉమను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై గత వారం విజయవాడలో రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆయన ఎడమ కంటికి తీవ్ర గాయం అయ్యింది. అయితే దాడి చేయించింది బోండా ఉమనే అని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈనేపథ్యంలో నిన్న రాత్రి బోండా ఉమ ఇంటి వద్దకు పోలీసులు చేరుకున్నారు. ఆయన్ను అరెస్ట్ చేస్తారేమో అని తెలుగు దేశం పార్టీ నాయకులు కూడా భారీ ఎత్తున బోండా ఉమ ఇంటికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో హై టెన్షన్ నెలకొంది. నిన్న రాత్రి పోలీసులు బోండా ఉమ ఇంటికి చేరుకోగానే ఆయన భయపడి వెనక నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్లిపోయారు. అక్కడకు కార్యకర్తలు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ రాయి కేసులో తనకు ఏ సంబంధం లేదని కూడా ఆయన స్పష్టం చేసారు.
ALSO READ