EXCLUSIVE: TDPకి షాక్.. గల్లా గుడ్‌బై..!
EXCLUSIVE: తెలుగు దేశం పార్టీకి (TDP) ఎన్నికల ముందు పెద్ద షాక్ తగలబోతోంది. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ (galla jayadev) పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారు. కొంతకాలంగా తెలుగు దేశం పార్టీకి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాల్లోనూ జయదేవ్ పాల్గొనడంలేదు. నిజానికి చాలా కాలంగా ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ విషయం గురించి తెలుగు దేశం పార్టీ హైకమాండ్‌తో ఈనెల 28న జయదేవ్ సమావేశం కానున్నారు. తానెందుకు దూరంగా ఉండాలనుకుంటున్నారో వివరించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఆయన మరే పార్టీలోనూ చేరడంలేదు. ఈసారి ఎన్నికలకు ఆయన దూరంగా ఉండాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తనను రెండుసార్లు గెలిపించిన తన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటుచేయనున్నారు.