Telangana Elections: అత్యధిక నామినేషన్లు ఈ ప్రాంతం నుంచే..!
Telangana Elections: నామినేషన్ల ప్రక్రియ పూర్తయిపోయింది. ఈరోజుతో పరిశీలించడాలు కూడా పూర్తయింది. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో 119 నియోజకవర్గాల్లో మొత్తం 4,798 మంది అభ్యర్ధులు నామినేషన్లు వేసారు. ఈ 4,798 మంది నుంచి నమోదైన నామినేషన్ల సంఖ్య 5,716. 119 నియోజకవర్గాల్లో KCR నియోజకవర్గం అయిన గజ్వేల్లోనే (gajwel) అత్యధిక నామినేషన్లు నమోదయ్యాయి. 145 మంది అభ్యర్ధులు 154 సెట్ల నామినేషన్లు వేసారు.
ఇక KCR పోటీ చేయనున్న రెండో నియోజకవర్గం కామారెడ్డిలో (kamareddy) 92 మంది అభ్యర్ధులు నామినేషన్లు వేసారు. గజ్వేల్ తర్వాత అత్యధిక నామినేషన్లు నమోదైన నియోజకవర్గం మేడ్చల్. తెలంగాణలోనే రిచెస్ట్ నియోజకవర్గం ఇదే. దాదాపు 116 మంది అభ్యర్ధులు మేడ్చల్లో నామినేషన్లు వేసారు. ఇక అత్యంత తక్కువ నామినేషన్లు నమోదైన నియోజకవర్గంగా నారాయణపేట ఉంది. కేవలం 13 మంది అభ్యర్ధులు మాత్రమే నామినేషన్ వేసారు.
సీట్ల షేరింగ్
అధికార BRS పార్టీ 119 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుండగా.. ప్రత్యర్ధి పార్టీ అయిన కాంగ్రెస్ 118 సీట్ల నుంచి పోటీ చేస్తోంది. మిగతా ఒక్కటి CPIకి ఇచ్చింది. AIMIM పార్టీ మొత్తం 9 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను దించింది. ఇక BJP 111 నియోజకవర్గాల్లో పోటీ చేస్తూ తాను పొత్తు పెట్టుకున్న జనసేనకు (janasena) 9 సీట్లు కేటాయించింది.