ఒక్క సినిమా.. ముగ్గురు హీరోయిన్ల జీవితాలు నాశనం..!
movie: సినిమా అనేది ఒక వ్యక్తిని రాత్రికి రాత్రే స్టార్‌ని చేసేస్తుంది. అదే సినిమా మనిషిని రోడ్డుపైకి కూడా తీసుకొస్తుంది. ఎన్నో ఆశలతో చిత్ర పరిశ్రమకు వచ్చిన ముగ్గురు హీరోయిన్లకు ఒక్క సినిమా అసలు కెరీర్ లేకుండా చేసేసింది. అసలు అది ఏ సినిమా.. ఎవరు ఆ హీరోయిన్లు అనేది తెలుసుకుందాం.
మీరు గ్రేసీ సింగ్ (gracy singh) గుర్తుందా? అదేనండీ.. సంతోషం (santosham) సినిమాలో నాగార్జునతో (nagarjuna) ఆడిపాడింది. ఆమె తెలుగు హిందీలో పలు చిత్రాల్లో నటించింది. కానీ సంతోషం సినిమాతోనే తెలుగులో బాగా పాపులర్ అయింది. లగాన్ (lagaan) లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన గ్రేసీ సింగ్‌కి ఒక సినిమా జీవితంలో కోలుకోలేని షాక్‌ని ఇచ్చింది. ఇంతకీ ఆ సినిమా పేరు ఏంటంటే.. దేశ్‌ద్రోహి (deshdrohi). ఎప్పుడూ బాలీవుడ్ సెలబ్రిటీలపై పిచ్చి కూతలు కూసే విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ (kamal r khan) ఈ సినిమాకు రచయితగా వ్యవహరించాడు. ఈ సినిమాలో గ్రేసీ సింగ్‌తో పాటు ఖడ్గం ఫేం కిమ్ శర్మ (kim sharma), హర్షిత భట్ (harshita bhatt)కూడా నటించారు.
ఈ సినిమా ఎంత విద్వంసం సృష్టించిందంటే.. మహారాష్ట్రలో ఈ సినిమాను రెండు నెలల పాటు నిషేధించారు. ఇందులో నటించిన ముగ్గురు హీరోయిన్లకు అసలు సినీ పరిశ్రమలో కెరీరే లేకుండాపోయింది. బహుశా ఈ సినిమాలో వారు నటించకపోయి ఉండి ఉంటే ఈపాటికి మరిన్ని సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకునేవారేమో.
ఈ సినిమాను రూ.3 కోట్ల బడ్జెట్‌తో తీస్తే యావత్ భారతదేశంలో ఈ సినిమా కలెక్షన్లు రూ.80 లక్షలు మాత్రమే. విచిత్రం ఏంటంటే.. ఈ సినిమాలో నటించిన వారి కెరీర్లు నాశనం అయిపోయి కానీ కథను రాసిన కమల్ ఆర్ ఖాన్‌కు మాత్రం విపరీతమైన హైప్ వచ్చింది. అతను అమాంతం ఎంతో ఫేమస్ అయిపోయాడు.