Jagan: నోరు జారితే చూస్తూ ఊరుకోం.. ఎన్నికల కమిషన్ హెచ్చరిక
Jagan: కేంద్ర ఎన్నికల కమిషన్ మరోసారి జగన్ మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చింది. తెలుగు దేశం, జనసేన పార్టీ అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం జగన్‌ను వివరణ కోరింది. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోం అని హెచ్చరించింది. గతంలో పార్టీలు, ఆ పార్టీ అధినేతలు ప్రజలకు ఏం చేసారు అనే అంశాలపైనే మాట్లాడాలి కానీ వ్యక్తిత్వ హననం చేయడం లాంటివి చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ALSO READ: