Donald Trump: మీ భార్యలను నా కోసం పంపుతున్నందుకు థ్యాంక్స్
Donald Trump: అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ వ్యాఖ్యలు చేసి వివాదాస్పదంగా మారారు. అమెరికాకి చెందిన చాలా మంది భర్తలు తమ భార్యలను తన కోసం పంపుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. తన ర్యాలీలు ఎక్కడ జరిగితే అక్కడికి ఎంతో మంది ఆడవారు వస్తున్నారని.. వారికి అనుమతి ఇచ్చిన భర్తలకు ధన్యవాదాలు అని ఆయన చెప్పడంతో రచ్చకు దారి తీసింది. అమెరికాలోని ఆడవారికి ట్రంప్ అంటే అసహ్యం అని ఎవరో కామెంట్ చేసారని అది నూటికి నూరు శాతం అబద్ధం అని.. ఆడవారికి తనంటే తనకు ఆడవారంటే ఇష్టం అని ట్రంప్ వ్యాఖ్యానించారు.