Telangana Elections: ప్రచారం కోసం అత్యధికంగా ఖర్చుపెట్టిన పార్టీ ఏదో తెలుసా?
Telangana Elections: ఇంకో రెండు వారాల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. BRS, BJP కాంగ్రెస్ (congress) పార్టీల ప్రచారాలు కూడా ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్ యాడ్స్ ద్వారా అత్యధికంగా ప్రచారం చేసిన పార్టీ ఏది.. ఎంత వరకు ఖర్చు చేసింది వంటి విషయాలు తెలుసుకుందాం.
కేవలం వారం రోజుల వ్యవధిలో మధ్యప్రదేశ్, తెలంగాణలో అత్యధికంగా ఫేస్‌బుక్ యాడ్స్ ద్వారా ప్రచారం చేసిన పార్టీ కాంగ్రెస్. ఆ తర్వాత జాబితాలో BJP ఉంది. కేవలం మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వారం రోజుల్లో రూ.26 లక్షల వరకు కాంగ్రెస్ ఫేస్‌బుక్ యాడ్స్ కోసం ఖర్చు చేసింది. తెలంగాణలో రూ.13.24 లక్షలు.. మధ్యప్రదేశ్‌లో రూ.12.84 లక్షలు ఖర్చు చేసింది.
కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే పేరిట ఖర్గే ఫ్యాన్ క్లబ్ ఏకంగా రూ.4 లక్షలు ఖర్చు చేసి మరీ ఫేస్‌బుక్ ప్రకటనలు వేయించింది. అలాగని BJP తక్కువ అని కాదు. తెలంగాణలో పెద్దగా ప్రకటనలు ఇవ్వకపోయినా ఛత్తీస్‌గడ్, రాజస్థాన్‌లో కేవలం గత వారం మాత్రమే రూ.26 లక్షల వరకు ఖర్చు చేసింది.
ఇక సింగిల్ యాడ్ కోసం అత్యధికంగా ఖర్చు చేసిన పార్టీ BJP. కేవలం ఛత్తీస్‌గడ్లో 692 యాడ్స్ కోసం రూ. 18.89 లక్షలు ఖర్చు చేసింది. గత వారం రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ రూ.13.24 లక్షలు ఖర్చు చేసి సింగిల్ యాడ్ ప్రకటనలను 38 సార్లు చేయించింది.