Janasena: జాతీయ జ‌న‌సేన పార్టీ.. ఇదెప్పుడు పెట్టారు?

జ‌న‌సేన పార్టీ (janasena) గురించి మ‌నంద‌రికీ తెలిసిందే. ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) ఈ పార్టీని స్థాపించారు.. ఈ పార్టీ గుర్తు గాజు గ్లాస్ అని కూడా మ‌న‌కి తెలుసు. మ‌రి జాతీయ జ‌న‌సేన పార్టీ (jatiya janasena party) గురించి విన్నారా? అస‌లు దీనిని ఎవ‌రు ఎప్పుడు పెట్టారో తెలీదు కానీ.. ఈ పార్టీ కూడా రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తోంద‌ట‌. కేవ‌లం తెలంగాణ‌లోనే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని అన్ని స్థానాల్లో ఈ పార్టీ పోటీ చేయ‌బోతోంద‌ట‌. అయితే.. ఎన్నిక‌ల క‌మిష‌న్ జ‌న‌సేకు టీ గ్లాస్ పార్టీ గుర్తుగా కేటాయిస్తే.. జాతీయ జ‌న‌సేన పార్టీకి మాత్రం బ‌కెట్ గుర్తును కేటాయించ‌డంతో జ‌న‌సైనికులు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుకుంటున్నారు. (janasena)