స్టెప్పులేసి దుమ్మురేపిన సీపీఐ నారాయణ

ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు చేయడంలో ఎప్పుడూ ముందుండే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సినిమా పాటలకు స్టెప్పులేస్తూ ఉల్లాసంగా గడిపారు. విజయవాడ అమరావతి యోగా అండ్ ఏరోబిక్ అసోసియేషన్ హాల్లో యోగా చేసిన నారాయణ.. అనంతరం అదే హాల్లో జుంబా డాన్స్‌ ప్రాక్టీస్ చేశారు. గ్రూప్ సభ్యులతో కలిసి కొంతసేపు నృత్యం చేశారు. డీజే పాటలకు సైతం స్టెప్పులు వేసి నారాయణ అలరించారు.