Hyderabad: భార్య, పిల్లలతో సహా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బలవన్మరణం

హైదరాబాద్‌ కుషాయిగూడ పరిధి కాప్రాలోని కందిగూడలో నివాసం ఉంటున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో ఆ పరిసర ప్రాంతాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇద్దరు చిన్నారులతో సహా దంపతులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న సతీశ్‌ (39), అతని భార్య వేద (35), వారి పిల్లలు నిషికేత్‌ (9),నిహాల్‌ (5) కలిసి ఒకే ఉంటో ఉంటున్నారు. అయితే తరచూ పిల్లలు అనారోగ్యం పాలుకావడం ఆ తల్లిదండ్రులను కలచివేసింది. దీంతో మనస్తాపానికి గురైన వారు పిల్లలతో సహా.. సైనేడ్‌ మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. సతీశ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి ఎలాంటి ఆర్థిక స‌మ‌స్య‌లు లేవు. మొద‌టి బిడ్డ‌కు ఆటిజం ఉండగా.. రెండో బిడ్డ‌కు మెనింజైటిస్ అనే బ్రెయిన్ ఇన్‌ఫెక్ష‌న్ ఉన్న‌ట్లు తెలిసింది. దాంతో పిల్ల‌లు అలా బాధ‌ప‌డ‌టం చూసి త‌ట్టుకోలేక ముందు పిల్ల‌ల‌కు సెనైడ్ మింగించి వాళ్లు చ‌నిపోయార‌ని ధృవీక‌రించుకున్నాక భార్యా, భ‌ర్త‌లు కూడా ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. చ‌నిపోయే ముందు రాసిన లెట‌ర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో “మ‌మ్మ‌ల్ని బ‌తికించాల‌ని ప్ర‌య‌త్నించ‌కండి ప్ర‌శాంతంగా చ‌నిపోనివ్వండి” అని రాసిన‌ట్లు పోలీసులు తెలిపారు.