Congress: 2024లో మోదీ ఇంటి నుంచే జెండా ఎగరేస్తారు
Hyderabad: 2024 ఎన్నికల (lok sabha elections) తర్వాత వచ్చే స్వాతంత్ర్య దినోత్సవం నాడు నరేంద్ర మోదీ (narendra modi) ఇంటి నుంచి జాతీయ జెండాను ఎగరవేస్తారంటూ సెటైర్లు వేసారు కాంగ్రెస్ (congress) సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగ్రాలోని రెడ్ ఫోర్ట్ (red fort) వద్ద జాతీయ జెండాను ఎగరేసారు మోదీ. ఆ తర్వాత ఆయన 90 నిమిషాల పాటు ప్రసగించారు. ప్రసంగం ముగిసే సమయంలో మళ్లీ ఇదే ఎర్ర కోట దగ్గర కలుద్దాం అన్నారు. అంటే 2024 ఎన్నికల తర్వాత కూడా తానే ప్రధాన మంత్రిగా గెలుస్తానని మోదీ ఇన్‌డైరెక్ట్‌గా ధీమా వ్యక్తం చేసారు.
దీనిపై కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే స్పందిస్తూ.. 2024లో మోదీ తప్పకుండా జాతీయ జెండాను ఎగరేస్తారు. కాకపోతే ఆయన ఇంటి నుంచి. మోదీని గెలిపించేది ఓడించేది ప్రజల చేతుల్లో ఉంటుంది. అలాంటప్పుడు 2024లో మళ్లీ నేనే వస్తా అని అనడం పొగరుగా వ్యవహరించడమే అవుతుంది అని విమర్శించారు. అంత పొగరుగా మాట్లాడిన అసవరం ఏముందని ఈ సందర్భంగా ఖర్గే మోదీని ప్రశ్నించారు. (congress)
చీటీ రాసి పెట్టిన ఖర్గే
రెడ్ ఫోర్ట్‌లో మోదీ ప్రసంగానికి ఖర్గే కూడా హాజరుకావాల్సి ఉంది. కానీ ఆయన రాకపోగా.. అక్కడ తనకోసం ఏర్పాటుచేసిన కుర్చీకి ఓ చీటీ పెట్టించారు. అందులో నాకు కళ్ల సమస్య ఉంది. రాలేను అని పేర్కొన్నారు. మరి ఇప్పుడు ఎలా వచ్చారు అని మీడియా వర్గాలు అడిగితే.. “” నేను ఉదయాన్నే లేచి మా ఇంట్లో జెండా ఎగరేసాను. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చాను. కనీసం మన రాష్ట్రంలో జరిగే వేడుకకైనా రావాలన్న ఉద్దేశంతోనే నేను కళ్ల సమస్య ఉన్నా అంత ట్రాఫిక్ ఉన్నా రాగలిగాను “” అని తెలిపారు. (congress)