EXCLUSIVE: జనసేనతో కాళ్ళ బేరానికి TDP..!
EXCLUSIVE: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (ap elections) ఈసారి బరిలోకి దిగనున్న పార్టీలకు చావో రేవో అన్నట్లు ఉన్నాయి. ఈసారి తెలుగు దేశం పార్టీ (TDP) అధికారంలోకి రాకపోతే ఇక పూర్తిగా పార్టీ కనుమరుగైపోయే అవకాశం లేకపోలేదు. తెలుగు దేశం పోతే ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీగా జనసేన (janasena) నిలిచేలా ఉంది. అందులోనూ ఇది చంద్రబాబు నాయుడుకి మరోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు చివరి ఎన్నికలు.
కాబట్టి ఆరు నూరైనా తెలుగు దేశం పార్టీ ఈ ఎన్నికల్లో గెలవాలన్న దృఢ సంకల్పంతో ఉంది. ఈసారి ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి (jagan mohan reddy) ఓడిపోతాడు అని చెప్తున్నప్పటికీ తెలుగు దేశం పార్టీలో ఎక్కడో మూల చిన్న భయం అయితే ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు (chandrababu naidu) అసలు ఛాన్స్ తీసుకోవాలని అనుకోవడంలేదు.
ఈ నేపథ్యంలో తన పొలిటికల్ పార్ట్‌నర్ జనసేనాని పవన్ కళ్యాణ్‌తో (pawan kalyan) మరోసారి చర్యలు జరిపేందుకు చంద్రబాబు సన్నద్ధం అవుతున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్నా కూడా ఇంకా జనసేన, తెలుగు దేశం పార్టీ మధ్య సీట్ల సర్దుబాటు కుదరలేదు. పైగా పవన్ రెండు నియోజకవర్గాలను ప్రకటించడంతో పార్టీల్లో రచ్చ జరుగుతోంది. పొత్తు లేకుండా గెలిచినట్లు చరిత్రలోనే లేదు కాబట్టి చంద్రబాబు పవన్ కాళ్ల బేరానికి వెళ్లేందుకు కూడా సిద్ధమయ్యారని తెలుగు దేశం పార్టీ సన్నిహిత వర్గాలు తెలిపాయి.