ఇక జగన్ పేరు వినిపించదు.. చంద్రబాబు కీలక నిర్ణయం
Chandrababu Naidu: జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాత్రికి రాత్రి ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు మార్పించేసారు. ఇప్పుడు తెలుగు దేశం పార్టీ గెలవడంతో వైఎస్సార్ పేరు తీసేసి ఎన్టీఆర్ పేరును పెట్టించారు. ఇదే కాకుండా గత ప్రభుత్వంలో జగన్ పేరుతో ఉన్న అన్ని పథకాలకు ఆ పేరును తీసేయాలని అసలు ఎక్కడా కూడా జగన్ పేరు వినిపించకుండా కనిపించకుండా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారు.
గతంలో ప్రభుత్వ కార్యాలయాలకు కూడా జగన్ పార్టీ రంగులు వేసారు. రంగులు మార్చడాలు ప్రతి పథకంపై జగన్ పేరు అచ్చు వేయించుకోవడాలు చూసి ప్రజలు కూడా మండిపడ్డారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ పేర్లన్నీ తీయించేసారు. జగనన్న విద్యా దీవెనకు వసతి దీవెనలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అని పేరు మార్చారు. వైఎస్సార్ కళ్యాణమస్తు పథకానికి చంద్రన్న పెళ్లి కానుక అని వైఎస్సార్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతి అని పేరు పెట్టారు. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహ పథకంలో జగన్ పేరును తొలగించారు. ఈ కొత్త పథకాల పేర్లు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం జీవో విడుదల చేసింది.