Chandrababu Naidu: చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన..!
రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ఆరోగ్య విషయంపై తీవ్ర ఆందోళన నెలకొంది. గతంలో ఆయన ఎడమ కంటికి శస్త్రచికిత్స జరిగిందని.. మొన్న జైల్లో వైద్యులు కళ్లకు పరీక్షలు నిర్వహించగా ఇప్పుడు కుడికంటికి శస్త్ర చికిత్స చేయాలని రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
అయితే జైలు అధికారులు ప్రవేశపెట్టిన హెల్త్ బుల్లెటిన్ రిపోర్ట్.. నారా భువనేశ్వరికి (nara bhuvaneswari) ఇచ్చిన హెల్త్ బుల్లెటిన్ రిపోర్ట్ తేడాగా ఉండటంతో పలు అనుమానాలకు దారి తీస్తోందట. దాంతో ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో చంద్రబాబు తరఫు లాయర్లు పిటిషన్ వేసారు. చంద్రబాబు ఆరోగ్య విషయంలో జైలు అధికారులు ఏదో దాస్తున్నారని TDP నేతలు, చంద్రబాబు కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.