Caste Survey: అసలు ఎందుకీ కుల గణన సర్వే.. ?
2024 లోక్ సభ ఎన్నికలు (lok sabha elections) రానున్న నేపథ్యంలో బిహార్ (bihar) ప్రభుత్వం రాష్ట్రంలో కుల గణన సర్వే (caste survey) చేపట్టింది. అసలు ఈ సర్వే వల్ల బిహార్ ప్రభుత్వానికి ఎలాంటి లాభం చేకూరనుంది. రానున్న ఎన్నికల్లో ఈ సర్వే ఎలాంటి ప్రభావం చూపుతుందో క్లుప్తంగా తెలుసుకుందాం.
ఈ సర్వే ఎందుకు చేసారు?
బిహార్‌లో ఏ కులాల వారున్నారో క్లియర్‌గా తెలిస్తే.. వెనుకబడిన వారికి ఎలాంటి ప్రభుత్వ హామీలు వస్తున్నాయో ఓ క్లారిటీ వస్తుంది. దీనిని బట్టి రాబోయే ఎన్నికల్లో వారి కోసం ఏవైనా పథకాలను ప్రవేశపెడితే అనుకూలంగా ఓట్లు పడే అవకాశం ఉంటుంది.
ఫలితాలు
కుల గణన సర్వే (caste survey) చేపట్టిన తర్వాత వచ్చిన డేటా ప్రకారం రాష్ట్రంలో 63% OBCలే ఉన్నారు. ఎక్కువగా సామాజిక, ఆర్థిక సమస్యలను తరతరాలుగా ఎదుర్కొంటూ వస్తున్న కులం OBC. 27% BCలు, జనరల్ కేటగిరీకి చెందినవారు 15.52%, అత్యధికంగా వెనుకబడిన కులాలు 36%, SCలు 19%, STలు 1.68% ఉన్నారని సర్వేలో తేలింది.
రాజకీయ ప్రభావం
బిహార్ రాజకీయ పార్టీలలో ఈ కుల గణన సర్వే డేటా వల్ల కీలక మార్పులు జరగనున్నాయి. ఎందుకంటే ఎన్నికల్లో గెలిచేందుకు ఎక్కువగా బిహార్ రాజకీయ నేతలు వివిధ కులాలకు చెందినవారిపైనే ఆధారపడతారు. ఏ కులం వారు ఎంత శాతం ఉన్నారని తెలిస్తే వారికి తగ్గట్టు పొలిటికల్ ప్లాన్లు వేసుకునే వీలు ఉంటుంది.
ప్రతిపక్షాల సవాళ్లు
కొన్ని ప్రతిపక్ష పార్టీలు కుల గణన సర్వే (caste survey) పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. ఇలాంటి సర్వేలను కేవలం కేంద్ర ప్రభుత్వాలు మాత్రమే చేపడతాయని వారు వాదిస్తున్నారు. కానీ సుప్రీంకోర్టు, పట్నా హైకోర్టులు రాష్ట్రం చేపట్టిన ఈ సర్వే సబబే అని తేల్చి చెప్పాయి.
జాతీయ కుల గణన
ఈ నేపథ్యంలో సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్ పార్టీలు జాతీయ కుల గణనకు పిలుపునిచ్చాయి. దీని వల్ల అన్ని కులాల వారికి సమానంగా ప్రభుత్వ హామీలు, పథకాలు దక్కుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనికి వ్యతిరేకంగా ఉంది.
చారిత్రక నేపథ్యం
1947 తర్వాత చేపట్టిన మొట్ట మొతటి కుల గణన సర్వే ఇదే. చివరి సారిగా 1931లో కుల గణనను చేపట్టారు. అంతకంటే ముందు 1881లో బ్రిటిషర్లు కుల గణన చేపట్టారు.
సీఎం అత్యవసర మీటింగ్
కుల గణన డేటా సేకరించిన వెంటనే బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 9 పార్టీ నేతలతో రేపు కీలక సమావేశం ఏర్పాటుచేసారు. రానున్న ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేదానిపై క్లియర్‌గా చర్చించాలని పిలుపునిచ్చారు.