BJP: ప‌వ‌ర్ షేరింగ్ ఉందా.. ప‌వ‌న్ కూడా సీఎం..!?

BJP: తెలుగు దేశం, జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీలు క‌లిసి పొత్తు పెట్టుకుని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగ‌నున్నాయి. పొత్తుల వ‌ర‌కు ఓకే కానీ అధికారంలోకి వ‌చ్చాక మాత్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu) మాత్రమే ఉంటార‌ని ఆల్రెడీ ఆయ‌న కుమారుడు నారా లోకేష్ స్ప‌ష్టం చేసేసారు. మాట్లాడితే ప‌వ‌న్ అన్నా ప‌వ‌న్ అన్నా అని ఎంతో ఆప్యాయంగా పిలిచే నారా లోకేష్ (Nara Lokesh) మాట వ‌ర‌స‌కు కూడా త‌మ‌తో జ‌న‌సేన (Janasena) చేతులు క‌లిపినందుకైనా ప‌వ‌ర్ షేరింగ్ ఉంటుందని కానీ క‌నీసం ఏడాది పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ఉంటార‌ని కానీ లోకేష్ అన‌లేదు.

దాంతో జ‌న‌సేనలోని ప‌లువురు నేత‌లు, కార్య‌క‌ర్తలు కాస్త చిన్న‌బుచ్చుకున్నారు.  అయితే సీట్ల షేరింగ్‌లో భాగంగా నిన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, చంద్ర‌బాబు నాయుడు.. భార‌తీయ జ‌న‌తా పార్టీ నుంచి గ‌జేంద్ర సింగ్ శెఖావ‌త్, జై జ‌యంత్ పండాలు క‌లిసి చ‌ర్చించుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత సీట్ల షేరింగ్ కూడా ఓ కొలిక్కి వ‌చ్చేసింది.

ALSO READ: YS Sharmila: మా అన్న BJPతో అక్ర‌మ పొత్తులో ఉన్నారు

పోటీ చేసే సీట్లు

భార‌తీయ జ‌న‌తా పార్టీ – 6 పార్ల‌మెంట్ సీట్లు, 1 అసెంబ్లీ స్థానాలు

తెలుగు దేశం పార్టీ – 17 పార్ల‌మెంట్ సీట్లు, 144 అసెంబ్లీ స్థానాలు

జ‌న‌సేన – 2 పార్ల‌మెంట్ సీట్లు, 21 అసెంబ్లీ స్థానాలు

అయితే చ‌ర్చ‌లో భాగంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప‌వ‌ర్ షేరింగ్ ఉంటే బాగుంటుంది క‌దా.. జ‌న‌సేన‌కు కూడా ప‌వ‌ర్ షేరింగ్ ఇవ్వ‌చ్చు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా సీఎం అవ్వ‌చ్చు అని మాట‌వ‌స‌ర‌కు అన్నార‌ట‌. ఇది విన్న చంద్ర‌బాబు నాయుడు ఒక్క‌సారిగా అవాక్క‌య్యార‌ట‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం త‌మ‌దే కాబ‌ట్టి..ప‌వ‌ర్ షేరింగ్ ఇప్పుడు కుదిరే అంశం కాదు స‌ర్ అని చంద్రబాబు నాయుడు భార‌తీయ జ‌న‌తా పార్టీ హైక‌మాండ్‌తో న‌వ్వుతూ చెప్పిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.