Lok Sabha Elections: BJP ఎక్కువ.. కాంగ్రెస్ త‌క్కువ.. కొత్త ట్విస్ట్

Lok Sabha Elections: లోక్ స‌భ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో ప్ర‌ధాన జాతీయ పార్టీలు అయిన BJP, కాంగ్రెస్ (congress) కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాయి. అదేంటంటే.. ఈసారి పెద్ద ఎన్నిక‌ల్లో BJP ఎక్కువ సీట్ల నుంచి పోటీ చేయ‌బోతుండ‌గా.. కాంగ్రెస్ మాత్రం త‌క్కువ సీట్ల‌కు ప‌రిమితం కావాల‌నుకుంటోంది. లోక్ సభ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఓటు శాతం 90 ఉండ‌గా.. కాంగ్రెస్‌కు 50 శాతం మాత్ర‌మే ఉంది.

2019లో భార‌తీయ జ‌న‌తా పార్టీ 435 సీట్ల నుంచి పోటీ చేసింది. మిగ‌తా సీట్ల‌ను ప్ర‌తిప‌క్షాల‌కు వ‌దిలేసింది. ఈ 435 సీట్ల నుంచి పార్టీ 303 సీట్లు మాత్ర‌మే గెలుచుకోగ‌లిగింది. 2019లో మ‌హారాష్ట్ర‌, బిహార్, త‌మిళ‌నాడు, పంజాబ్‌లో మాత్రం భార‌తీయ జ‌న‌తా పార్టీ లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేదు. దాంతో 2019తో పోలిస్తే 2024లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎక్కువ సీట్ల‌లో పోటీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్ర‌తిప‌క్షాల్లో స‌రైన బ‌లం లేదు. దాంతో చాలా మ‌టుకు సీట్లు భార‌తీయ జ‌నతా పార్టీకి అనుకూలంగా మారే అవ‌కాశం ఉంటుంది. 2024లో భార‌తీయ జ‌న‌తా పార్టీ దాదాపు 500 సీట్ల నుంచి పోటీ చేయ‌నుంది. కాంగ్రెస్ 300 నుంచి మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంది.