Kashmir గాజాలా మారబోతోందా?
Kashmir: కశ్మీర్ కూడా త్వరలో గాజాలా (gaza) మారిపోతుందా? కశ్మీర్‌కు ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? అసలు మన భారత ప్రభుత్వం ఆ పరిస్థితి వచ్చే వరకు చూస్తూ ఊరుకుంటుందా? ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫారూక్ అబ్దుల్లా (farooq abdulla) ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు ఇది వివాదాస్పదంగా మారింది. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు కాపు కాసి మరీ ఐదుగురు జవాన్లపై కాల్పులు జరిపారు. ఈ ఘటన నేపథ్యంలో అబ్దుల్లా కశ్మీర్‌కు గాజా పరిస్థితి ఏర్పడబోతోందని అన్నారు.
త్వరలో భారత్, పాకిస్థాన్ కూర్చుని ఉగ్రవాదం గురించి చర్చలు మెరుగైన చర్యలు చేపట్టకపోతే గాజా పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. త్వరలో జరగబోయే పాకిస్థాన్ ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ మళ్లీ ప్రధాన మంత్రి అయ్యేలా ఉన్నారని ఆయన ఇండియాను పొగుడుతూ స్నేహపూర్వకంగా మెలగాలని అనుకుంటున్నప్పటికీ భారత్ మాత్రం అందుకు సిద్ధంగా ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నారు.
BJP ఏమంటోంది?
అయితే పాకిస్థాన్‌ది ఎప్పటికైనా వంకర బుద్ధేనని వారి ముందు ఒకసారి తలదించినందుకే వెన్నపోటు పొడిచారని BJP అంటోంది. అందుకే మరోసారి వారి మాయలో పడాలని అనుకోవడంలేదని.. ఇంత జరిగిన తర్వాత కూడా ఫారూక్ అబ్దుల్లా ఇంకా పాకిస్థాన్‌తో చర్చలు జరపండి అని అనడం సిగ్గుచేటని మండిపడుతోంది.