Big Meet: రేపు NDA, INDIA కీల‌క‌ సమావేశం

రేపు మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలో (mumbai) అతిపెద్ద స‌మావేశం (big meet) జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశంలో NDA, INDIA కూట‌ములు పాల్గొన‌నున్నాయి. రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎలా పోటీ చేయాలి, ఎలా ప్ర‌చారం చేయాలి అన్న విష‌యాలను చ‌ర్చించ‌నున్నాయి. రేపు, ఎల్లుండి ఈ స‌మావేశం జరుగుతుంది. ఇండియా కూటమికి చెందిన మొత్తం 26 పార్టీలు ఈ స‌మావేశంలో పాల్గొన‌నున్నాయి. ఈశాన్య రాష్ట్రాల‌కు చెందిన కొన్ని పార్టీలు కూడా రేప‌టి స‌మావేశంలో పాల్గొనే అవ‌కాశం ఉంద‌ని శివ‌సేన (ఉద్ధ‌వ్ ఠాక్రే సైన్యం) నేత సంజ‌య్ రౌత్ తెలిపారు.

సీట్ల షేరింగ్ ఫార్ములా గురించే ఈ స‌మావేశంలో బ‌లంగా చర్చించ‌నున్నారు. ఇండియా కూట‌మికి సంబంధించి ఇప్ప‌టికే రెండు స‌మావేశాలు అయ్యాయి. రెండో స‌మావేశంలోనే త‌మ కూట‌మికి ఇండియా అని పేరు పెట్టారు. ఇప్పుడు మూడో స‌మావేశం ముంబైలో జ‌ర‌గ‌నుంది. ఈ మీటింగ్‌లో త‌మ లోగోను ఆవిష్క‌రించ‌నున్నారు. రేపు జ‌ర‌గ‌బోయే మీటింగ్‌లో ఇండియా కూట‌మి క‌న్వీన‌ర్‌గా మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేకి బ‌దులు వేరొక‌రిని పెడితే బాగుంటుంద‌ని బిహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ చర్చించ‌బోతున్నారు. (big meet)

ఇక శివ‌సేన నేత‌లకు ఇదే చివ‌రి స‌మావేశం కానుంది. ఈ స‌మావేశం త‌ర్వాత అంతా ప్రచారాల్లో బిజీగా ఉండ‌నున్నారు. ఇక మ‌హారాష్ట్ర‌లో ఉన్న BJP- శివ‌సేన కూట‌మికి చెందిన నేత‌లు స‌మావేశం కానున్నారు. మ‌హారాష్ట్ర‌లో ఉన్న మొత్తం 48 లోక్‌స‌భ సీట్ల గురించి చ‌ర్చింనున్నారు. రేపు రాత్రి మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఏక‌నాథ్ శిండే నివాసంలో డిన్న‌ర్ కార్య‌క్ర‌మం ఉంది. ఈ కార్య‌క్ర‌మంలోనే అన్ని చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్నాయి. (big meet)