భూమా అఖిల ప్రియ ఇంటి ముందు మర్డర్ అటెంప్ట్
Bhuma Akhila Priya: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో హైటెన్షన్ నెలకొంది. తెలుగు దేశం పార్టీ నేత భూమా అఖిల ప్రియ బాడీగార్డ్ నిఖిల్‌పై ఆమె ఇంటి ముందే మర్డర్ అటెంప్ట్ జరిగింది. నిన్న అర్థరాత్రి నిఖిల్ మరో వ్యక్తితో రోడ్డుపై మాట్లాడుతుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు కారుతో దూసుకొచ్చి వారిని ఢీకొన్నారు. ఈ ఘటనలో నిఖిల్ ఎగిరిపడ్డాడు. మరో వ్యక్తి తృటిలో తప్పించుకున్నాడు. నిఖిల్ గాయాలైనప్పటికీ లేచి పారిపోతుండగా.. కారులో నుంచి వ్యక్తులు దిగి అతనిపై కత్తులతో దాడి చేసారు. అనంతరం వారు అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే నిఖిల్‌ను హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. నిన్న అర్థరాత్రి జరిగినదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఆ దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి.