Jr NTR: “తార‌క్‌కి పొలిటిక‌ల్ స‌క్సెస్ బాగా ఉంటుంది”

Hyderabad: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు (ap elections) ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో ప్ర‌ముఖ జ్యోతిష్యుడు PVR న‌ర‌సింహారావు (narasimha rao) Jr NTR, నారా లోకేష్‌ల‌పై (nara lokesh) చేసిన కామెంట్లు వైర‌ల్ అవుతున్నాయి. యువ‌గ‌ళం (yuvagalam) పాద‌యాత్ర‌లో బిజీగా ఉన్న నారా లోకేష్ మ‌రో ప‌దేళ్లు అయినా సీఎం కాలేడంటూ షాకింగ్ కామెంట్లు చేసాడు. ఇక సినిమాల్లో తాత‌గారినే మించిపోయిన జూనియ‌ర్ ఎన్టీఆర్‌కి (jr ntr) మంచి పొలిటిక‌ల్ స‌క్సెస్ ఉండ‌బోతోంద‌ని కానీ దానికి ఇంకా చాలా సమ‌యం ప‌డుతుంద‌ని తెలిపారు. చాలా మంది అంటున్న‌ట్లు నారా లోకేష్ (nara lokesh) ప‌ప్పు కాద‌ని, కాక‌పోతే రాజకీయ ఇంటెలిజెన్స్ లేని వ్య‌క్తని అన్నారు. వారి ల‌గ్నాలు సింహ, మ‌కర కావ‌డంతో అస‌లు ఇద్ద‌రికీ ప‌డ‌ద‌ని తెలిపారు. ఇక రానున్న రోజుల్లో ఎన్టీఆర్‌కి జ‌నాల్లో ఉన్న ఫాలోయింగ్ రెట్టింపు కాబోతోంద‌ని చెప్పారు. దాంతో ఆయ‌న వ్యాఖ్య‌లు కాస్తా ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. అయితే ఇవ‌న్నీ గ‌తంలో ఎందుకు చెప్ప‌లేదు అని ప‌లువురు నెటిజన్లు ప్ర‌శ్నించ‌గా.. గ‌తంలో త‌న‌కు NTR పుట్టినతేదీ వివ‌రాలు లేవ‌ని, ఇప్పుడు ల‌భించాయ‌ని క్లారిఫై చేసారు.