AP: ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు రూ.1,166 కోట్ల లోన్

AP: ఆంధ్రప్రదేశ్ లో (ap) ఇండస్ట్రియల్ కారిడార్ (industrial corridor) ఏర్పాటుకు అన్ని విధాల రంగం సిద్ధమవుతుంది. YCP ప్రభుత్వం చేస్తున్న కృషికి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ లో తలపెట్టిన రహదారులు, నీటిసరఫరా, విద్యుత్ పంపిణి లాంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి మద్దతుగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ADB), భారత ప్రభుత్వం 141.12 మిలియన్ డాలర్ల (రూ. 1166 కోట్లు) రుణ మంజూరు ఫైల్ పై సంతకం చేశాయి. అయితే ఈ ఆర్ధిక సహాయం మొత్తం 500 మిలియన్ డాలర్లు (రూ. 4135 కోట్లు) ఉండనుంది. పలు విడతల్లో ఆర్ధిక సహాయం అందించడానికి ఏడీబీ ముందుకు వచ్చింది. విశాఖపట్నం- శ్రీకాళహస్తి-చిత్తూరులో మౌలిక సదుపాయాల అభివృద్ధిని సులభతరం చేయడానికి 2016లో ADB ఫైనాన్సింగ్ ను ఆమోదించింది.

మల్టీ సెక్టోరల్ విధానాన్ని అవలంబించడం ద్వారా ఏడీబీ ఫైనాన్సింగ్ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో తయారీ రంగం వాటాను పెంచడానికి సహయపడుతుంది. దీని ద్వారా పోటీతత్వాన్ని పెంపొందించడమే కాకుండా, ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతాలలో ఉద్యోగ అవకాశాలను విసృతంగా సృష్టించవచ్చు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగుతుంది. పెట్టుబడులను ప్రోత్సాహించేందుకు మరియు సృష్టించేందుకు ఇది దోహదపడుతుంది. సామాజికంగా, ఆర్థికంగా ముందుకు వెళ్లడమే కాకుండా.. వ్యక్తుల నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. ఈ ప్రాజెక్ట్ గ్రీన్ కారిడార్ మోడల్ కార్యాచరణ మార్గదర్శకాలను ఏర్పాటు చేయడంలోనూ విపత్తు ప్రమాద నిర్వహణ ప్రణాళికను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. దీర్ఘకాలిక స్థిరత్వం కోసం, ఈ కార్యక్రమం స్టార్టప్ ఇండస్ట్రియల్ క్లస్టర్‌ల నిర్వహణను మెరుగుపరచడానికి ఒక ప్రణాళికను రూపొందిస్తుంది.