AP Budget News in Telugu: జిల్లాల పెంపునకు వ్యూహం.. బడ్జెట్ అంశాలు ఇవే
AP Budget News in Telugu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చివరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (buggana rajendranath reddy) ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వివరాలను ప్రసంగించారు. 2024 నుంచి 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.2,86,389 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ తాత్కాలికం మాత్రమే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో ఆ ప్రభుత్వం మరో కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. (AP Budget News in Telugu)
బడ్జెట్ వివరాలు ఇవే
ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాలు ఉండగా.. వాటిని 26కి పెంచనున్నారు.
గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో రూ.729 కోట్లతో 17,239 పనులు పూర్తి
నూతన కలెక్టరేట్ భవనాల నిర్మాణం
దాదాపు వెయ్యి పాఠశాలల్లో CBSE సిలబస్
విద్యార్థులకు ఉచితంగా 9.52.925 ట్యాబ్‌లు అందించాం. ఈ ట్యాబ్స్ దాదాపు 34 లక్షల మంది విద్యార్ధులకు ఉపయోగపడ్డాయి.
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం (AP Budget News in Telugu)
జగనన్న విద్యా కానుక కింద 47 లక్షల మంది విద్యార్ధులకు ప్రయోజనం
రూ.3,367 కోట్లతో విద్యార్ధులకు యూనిఫాంలు, పుస్తకాలు
99.81 పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు ఉన్నాయి
జగనన్న గోరుముద్ద పథకం 43 లక్షల మంది విద్యార్ధులకు అందింది
మధ్యాహ్న భోజనం పథకంలో గత ప్రభుత్వం కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఖర్చు (AP Budget News in Telugu)
వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కింద 35 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం
జగనన్న విద్యా దీవెన కింద రూ.11,901 కోట్ల ఖర్చు
52 నుంచి 77 వరకు రెవెన్యూ డివిజన్ల పెంపు. కొత్త రెవెన్యూ డివిజన్లలో కుప్పం ఒకటి.
నియోజకవర్గ స్థాయిలో 192 స్కిల్ హబ్‌లు ఏర్పాటు. 2023 నుంచి 2024 మధ్యలో 21 రంగాల్లో 6 వేల మంది అభ్యర్ధులకు శిక్షణ (AP Budget News in Telugu)
201 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో వర్చువల్ ల్యాబ్‌లు ఏర్పాటు
14 పారిశ్రామిక శిక్షణా కేంద్రాల్లో యంత్ర పరికరాలతో ల్యాబ్‌ల ఏర్పాటు
రైతు ఖాతాల్లోకి రూ.7802 కోట్లు
వైఎస్సార్ పంటల బీమా కింద 54 లక్షల 55వేల మందికి రైతు ఖాతాల్లో డబ్బు జమ
వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల కింద రూ.1835 కోట్లు జమ
10,778 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు
19 లక్షలకు పైగా విద్యుత్ కనెక్షన్లకు 9 గంటలకు పైగా ఉచిత కరెంట్
ఉచిత విద్యుత్‌పై రూ.37,374 కోట్ల రాయితీ
రూ.3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
ఇన్పుట్ సబ్సిడీ కింద 22 లక్షల మందికి రూ.1,977 కోట్ల సాయం (AP Budget News in Telugu)
ఇమామ్‌లకు అందించే సాయం రూ.10వేలకు పెంపు. దీని ద్వారా దాదాపు 5000 మంది ఇమామ్‌లకు ప్రయోజనం
జెరూసలెంకు వెళ్లిన యాత్రికులకు రూ.60వేల చొప్పున సాయం
హజ్ యాత్రకు వెళ్లిన 1756 మందికి రూ.80 వేల చొప్పు సాయం
రూ.20 వేల కోట్లతో నాలుగు ఓడ రేవుల నిర్మాణం. రామాయణ పట్నం, మచిలీ పట్నం, మూలపేట, కాకినాడలో పోర్టులు
2025 నుంచి 2026 నాటికి 110 MTPA అదనపు సామర్థ్యం. 75 వేల మందికి ఉపాధి అవకాశాలు.
రూ.3,800 కోట్లతో పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం. చేపలు, రొయ్యల వేట ద్వారా పది లక్షల మందికి ఉపాధి
17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల మంజూరు.
పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రం ఏర్పాటు
పోలవరం పూర్తికి కట్టుబడి ఉన్నాం. ఇప్పటికే పోలవరం 70 శాతం పూర్తైంది. రెండో అవుకు టన్నెల్ ప్రారంభించేసారు.
30 కరువు పీడిత మండలాల్లోని 15.25 లక్షల మందికి సురక్షిత తాగునీరు
లక్షా 35 వేల మంది ఉద్యోగులతో గ్రామ వార్డు సచివాలయాలు
2 లక్షల 66 వేల వాలంటీర్ల నియామకం