ys jagan: ట్రెండింగ్‌లో “అబ్బాయ్ కిల్డ్ బాబాయ్”
Hyderabad: దివంగత ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి(ys vivekananda reddy) మర్డర్ కేసులో భాగంగా ఈరోజు ఆయన సోదరుడు వైఎస్ భాస్కర్ రెడ్డి(bhaskar reddy) అరెస్ట్ అయ్యారు. భాస్కర్ రెడ్డి.. కడప ఎంపీ అవినాశ్ రెడ్డి(avinash reddy) తండ్రి. వివేకాను హత్య చేయడానికి కొన్ని రోజులు ముందు నిందితులతో భాస్కర్ రెడ్డి మాట్లాడినట్లు ఆధారాలు దొరికాయని సీబీఐ తెలిపింది. దాంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. పులివెందుల నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఈరోజు మధ్యాహ్నం కోర్టులో ప్రవేశపెడతారు.(abbai killed babai)
ఈ నేపథ్యంలో ట్విటర్‌లో అబ్బాయి కిల్డ్ బాబాయ్(abbai killed babai) అనే హ్యాష్‌ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే పలువురు ప్రతిపక్ష పార్టీ నేతలు వివేకాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగనే(ys jagan) హత్య చేయించి ఉంటారని ఆరోపించారు. ఇందుకు అవినాశ్‌రెడ్డితో చేతులు కలిపి హత్య చేయించారని అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి. అయితే అవినాశ్‌ను సీబీఐ విచారిస్తున్న సమయంలో “మన చేత్తో మన కన్నే ఎందుకు పొడుచుకుంటాం అధ్యక్షా.. “అంటూ గతంలో సీఎం జగన్ (jagan) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన నేపథ్యంలో ఈరోజు అనంతపురంకు వెళ్లాల్సిన జగన్.. ఆ ప్లాన్‌ను విరమించుకున్నారు. ఈరోజు దిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దాంతో భాస్కర్‌రెడ్డిని కేసు నుంచి తప్పించడానికి కేంద్రం సహాయం కోసమే వెళుతున్నారని ప్రతిపక్షాల ఆరోపణ. అంతేకాదు.. భాస్కర్ రెడ్డి అరెస్ట్ అవగానే.. జగన్‌కు చెందిన ప్రముఖ మీడియా ఛానెల్‌లో వైఎస్ పేరును తొలగించి కేవలం భాస్కర్ రెడ్డి అని ప్రచురించడం పలు అనుమానాలకు దారితీస్తోంది. భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయగానే జగన్ దిల్లీకి ఎందుకు వెళ్తున్నారని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. సీఎం జగన్‌కు ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా వెంటనే రాజీనామా చేయాలని పలువురు తెదేపా, జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు.