EXCLUSIVE: అనిల్ కుమార్‌కి జగన్ దిమ్మతిరిగే షాక్..!
EXCLUSIVE: YCP మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు (anil kumar yadav) ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (jagan mohan reddy) దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడోసారి కూడా టికెట్ వస్తుంది గెలిచేస్తాం అనుకుంటున్న అనిల్ ఆశలు అడియాసలయ్యాయి.
జగన్ అనిల్‌ను అసెంబ్లీకి బదులు పార్లమెంట్‌కు పంపించాలని నిర్ణయించారట. పల్నాడు జిల్లా నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఆదేశించారు. దాంతో ఈ విషయం కాస్తా పార్టీలో చర్చనీయాంశంగా మారింది. నెల్లూరులో YCP నేతలతో అనిల్‌కు విభేదాలు ఉండటం వల్లే స్థానచలనం కలిగిందని టాక్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చాక జగన్ అనిల్ కుమార్ యాదవ్‌ను తన క్యాబినెట్‌లో పెట్టుకుని జలవనరుల శాఖను అప్పగించారు.
అప్పటివరకు అందరితో కలివిడిగా ఉంటూ వస్తున్న అనిల్ కుమార్ యాదవ్‌లో ఒక్కసారిగా మార్పు వచ్చింది. సొంత మనుషులతో కొట్లాటలు పెట్టుకున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రూప్ కుమార్ యాదవ్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వంటి కావాల్సిన వ్యక్తులతో విభేదాలు వచ్చాయి. జగన్ సర్దుకుపోవాలని చెప్పినా అనిల్ వినిపించుకోకపోవడంతోనే సిటీలో గెలిచే పరిస్థితి లేదనే అంశం జగన్‌కు తెలిసింది.
నెల్లూరులో ముగ్గురు ఎమ్మెల్యేలను మార్చాల్సిన అవసరం ఉండగా పార్టీ హైకమాండ్ సర్వేలు చేయించింది. అనిల్ కుమార్‌పై వ్యతిరేకత ఉందని సర్వేలో తేలడంతో బీసీ నేతగా నరసరావుపేట ఎంపీగా పోటీ చేయిస్తే మంచిదని జగన్ అభిప్రాయపడ్డారు.