Congress: కాంగ్రెస్‌లోకి 11 మంది BRS ఎమ్మెల్యేలు..!?

Congress: ఈసారి ఎన్నిక‌ల్లో ఊహించ‌ని ప‌రిణామాలు ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. కాంగ్రెస్ ఎన్ని ఎత్తుగ‌డ‌లు వేసినా చివ‌రికి గెలిచేది తామే అని గ‌ట్టి కాన్ఫిడెన్స్‌తో ఉన్న BRSకి షాక్ త‌గిలింది. మ‌రీ ఒక వంతు సీట్లు రావ‌డంతో పార్టీ నైరాశ్యంలో ఉంది. అందులోనూ కామారెడ్డిలో KCR ఓడిపోవ‌డం కార్య‌క‌ర్త‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

ఇవ‌న్నీ పక్క‌న పెడితే.. ఇప్పుడు BRS పార్టీకి మ‌రో గ‌ట్టి దెబ్బ త‌గ‌ల‌బోతోంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. పార్టీకి చెందిన దాదాపు 11 మంది BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు జంప్ అవ్వ‌బోతున్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేయ‌గానే BRS నేతలు కాంగ్రెస్ కండువా క‌ప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. వారిలో మ‌ల్లారెడ్డి, స‌బితా ఇంద్రా రెడ్డి, దానం నాగేంద్ర‌, మాగంటి గోపీనాథ్, పాడి కౌశిక్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే భ‌ద్రాచ‌లం BRS నేత తెల్లం వెంక‌ట‌రావు కాంగ్రెస్ నేత‌లు రేవంత్ రెడ్డ‌, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిల‌ను క‌లిసారు.

గెలిస్తే 80 సీట్లు ప‌క్కా ఓడిపోతే క‌నీసం 60 సీట్లు ప‌క్కా అనుకున్న BRS పార్టీ నేత‌లు మ‌రీ 30 సీట్లు గెలుచుకుని ఆగిపోవ‌డంపై నేత‌ల్లో తీవ్ర అసంతృప్తి నెల‌కొంది. దాంతో ఇక BRS పార్టీ మ‌ళ్లీ గెలిచే అవ‌కాశం లేదేమో అని వారు ఇప్ప‌టినుంచే పార్టీలు మారేందుకు ప్లాన్ వేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.