ప్రియుడిని వదిలి ఉండలేకపోతున్నారా? ఇది చాలా డేంజర్
Relationship: మీరు బాయ్ ఫ్రెండ్ సిక్నెస్తో బాధపడుతున్నారా? అయితే అది చాలా డేంజర్ అని నిపుణులు అంటున్నారు. బాయ్ ఫ్రెండ్ సిక్నెస్ అంటే ఏంటంటే.. ఎప్పుడూ తను పక్కనే ఉండాలని.. ప్రతి చిన్న విషయానికి ప్రియుడిపైనే ఆధారపడాలనుకుంటే దానిని బాయ్‌ఫ్రెండ్ సిక్నెస్ అంటారు. ఒకవేళ మీకు కూడా బాయ్‌ఫ్రెండ్ సిక్నెస్ ఉంటే కొన్ని సమస్యలు తప్పవు. అవి ఏంటంటే.. సొంతంగా ఆలోచించే శక్తిని కోల్పోతారు. సొంత నిర్ణయాలు తీసుకోలేరు. కుటుంబానికి, స్నేహితులకు ప్రాధాన్యత ఇవ్వలేరు. అన్నింటికి మించి.. మీ ప్రియుడు ఏదన్నా పని మీద బయటికి వెళ్తే డిప్రెషన్లోకి వెళ్లిపోతారు. ఇది ఇంకా ప్రమాదం.
బాయ్‌ఫ్రెండ్ సిక్నెస్ వల్ల చాలా మంది అమ్మాయిలు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు దూరం అవుతున్నారని నిపుణులు చెప్తున్నారు. ఇదే బాయ్‌ఫ్రెండ్ సిక్నెస్ ఇలాగే కొనసాగితే.. ఈరోజు మీకు తోడుగా ఉన్న మీ ప్రియుడు రేపు ఏదన్నా గొడవ జరిగి దూరమైతే ఆ తర్వాత మీకు ఎవ్వరూ కూడా ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వలేరు. ఇప్పుడు ఏమయ్యాడు నీ ప్రియుడు అనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక బంధం బలపడాలంటే ఇద్దరికీ లక్ష్యాలు అనేవి ఉండాలి. జీవితంలో ఇద్దరికీ లక్ష్యాలు ఉంటే వాటిని చేరుకునేందుకు ఒకరికొకరు సాయం చేసుకోవడంతోనే ఆ బంధం బలపడుతుంది. అంతేకానీ.. 24 గంటలు ప్రియుడి చెయ్యి పట్టుకుని తిరుగుతుంటే ఆ బంధం ఎప్పటికీ నిలవదు అని గుర్తుంచుకోండి.