Naked Resignation: ట్రెండ్ అవుతున్న నగ్న రాజీనామా? అంటే ఏంటి?
Naked Resignation: ప్రస్తుతం ఐటీ రంగాల్లో నడుస్తున్న కొత్త ట్రెండ్ నేకెడ్ రిజిగ్నేషన్ (నగ్న రాజీనామా). అసలేంటీ ట్రెండ్? ఎందుకు ఇప్పుడు వైరల్ అవుతోంది? నగ్న రాజీనామా అంటే దుస్తులు విప్పేసి రాజీనామా చేయడం కాదండోయ్.. వేరే ఉద్యోగం చూసుకోకుండా ఉన్న ఉద్యోగం నుంచి రాజీనామా చేయడాన్ని నేకెడ్ రిజిగ్నేషన్ అంటారు.
వర్క్‌లో ఒత్తిడి ఎక్కువగా ఉండటం.. ఆఫీస్‌లో రాజకీయాలకు పాల్పడటం వంటి కారణాల వల్ల ఈ నగ్న రాజీనామా కేసులు ఐటీ కంపెనీల్లో ఎక్కువ అవుతున్నాయట. ఇలా చేస్తున్నవారు మరో ఉద్యోగం వెతుక్కుని రాజీనామా చేయడం లేదు. ఉన్నపళంగా ఉన్న ఉద్యోగాన్ని వదిలేసుకుంటున్నారు. ఇప్పుడు ఉద్యోగం లేకపోతే మళ్లీ వెతుక్కుంటాం.. అంతేకానీ ఈ ఒత్తిడి మా వల్ల కాదు అనేస్తున్నారు. ప్రస్తుతం ఈ నేకెడ్ రిజిగ్నేషన్ అనేది చైనీస్ కంపెనీల్లో ఎక్కువగా జరుగుతోంది. ఇక భారత్‌లో ఇలా రాజీనామాలు చేస్తూ ముందు తమ మానసిక ఆరోగ్యం చూసుకునేవారి సంఖ్య కాస్త తక్కువనేగా ఉందని చెప్పాలి.