Covid Vaccine: ఇప్పుడు ప్రాణాలు తీస్తోందా?
Covid Vaccine: కోవిడ్ మహమ్మారి సోకినప్పుడు కోవిడ్ వ్యాక్సిన్లే ప్రాణం పోశాయి. అప్పుడు ప్రాణం పోసిన ఈ వ్యాక్సిన్లు ఇప్పుడు ప్రాణం తీస్తున్నాయా? అవుననే అంటున్నాయి కొన్ని సర్వేలు. గుండె సంబంధిత సమస్యలు, మెదడులో రక్తం గడ్డ కట్టడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయని రిపోర్టులు చెప్తున్నాయి. WHO (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) ఆధ్యయనాలు నిర్వహించింది. ఈ రీసెర్చ్ వింగ్‌లో వ్యాక్సిన్ డేటా నెట్‌వర్క్‌కు సంబంధించిన పరిశోధకులు స్టడీ చేసారు. 16 రకాల అనారోగ్య సమస్యలకు వ్యాక్సిన్లు కారణం అవుతున్నాయని తేల్చారు.
ఈ వ్యాక్సిన్లు తీసుకున్న సుమారు 10 కోట్ల మందిపై రీసెర్చ్ చేసారు. వీరంతా ఇండియా మినహా ఆస్ట్రేలియా, డెన్మార్క్, కెనడా, న్యూజిల్యాండ్, ఫిన్‌ల్యాండ్, ఫ్రాన్స్, స్కాట్ ల్యాండ్, అర్జెంటీనా వంటి దేశాల్లో కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకున్నవారు. వీరిపై రీసెర్చ్ చేసిన నిపుణులు కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించారు. కొన్ని రకాల MRNA (మెసెంజర్ రైబో న్యూక్లిక్ యాసిడ్) వ్యాక్సిన్లు తీసుకున్నవారిలో గుండె కండరాలు వాపుకు కారణమయ్యే మయో కార్డియల్ సమస్యలు వచ్చే సూచనలు ఉన్నట్లు గుర్తించారు. (Covid Vaccine)
అంతేకాదు.. గులియన్ బారే సిండ్రోమ్ (Gullian Barre Syndrome), సెరీబ్రల్ వీనస్ సైనస్ థ్రాంబోసిస్ (cerebral venous sinus thrombosis) వంటి కేసులు 1.7 రెట్లు పెరిగాయని స్పష్టం చేసారు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఉన్న కార్డియాక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెడాన్ పరిశోధకులు గుండె జబ్బులకు, కోవిడ్ -19 మధ్య లింక్‌పై పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనలపై కొత్త విషయాలను వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో పోస్టురల్ ఆర్థోస్టేటిక్ టాకీకార్డియా సిండ్రోమ్ (Postural orthostatic tachycardia syndrome) అభివృద్ధి చెందుతోందని పరిశోధకులు తేల్చారు.
ALSO READ: మరో కరోనా మహమ్మారి రాబోతోంది..చైనా సైంటిస్ట్ హెచ్చరిక
మోడెర్నా (Moderna), ఫైజర్‌కు (Fizer) చెందిన వ్యాక్సిన్లను మొదటి మూడు డోసుల్లో తీసుకున్న వాటిలో మయో కార్డిటిస్ (myocarditis) కేసులను ఎక్కువగా గుర్తించారు. మోడెర్నా రెండో డోసు తీసుకున్న తర్వాత ఈ కేసులు ఎక్కువయ్యాయని వెల్లడించారు. అలాగే.. ఆస్ట్రాజెనికా (astrazeneca) టీకాలు మూడు మోతాదుల డోసులు తీసుకున్నవారిలో పెరీకార్డిటిస్ అనే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 6.9 శాతం పెరిగిందని తెలిపారు. మోడెర్నా టీకాను రెండో డోసులో తీసుకున్నవారిలో ఈ ప్రమాదం 2.6 శాతం పెరిగినట్లు గుర్తించారు. ఆస్ట్రాజెనికా టీకాలు తీసుకున్నవారిలో రక్తం గడ్డ కట్టే వ్యాధి బారిన పడే ప్రమాదం 2.3 రెట్లు ఎక్కువగా ఉందన్నారు.
రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేసే సిండ్రోమ్‌ను కూడా పరిశోధకులు గుర్తించారు. కరోనా వ్యాక్సిన్లతో ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని రీసెర్చ్‌లో తేలింది. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నమాట వాస్తవమే కానీ ఇప్పటికీ వ్యాక్సిన్ సురక్షితమే అని చెప్పారు. ఇదే సమయంలో కరోనా పీడ పూర్తిగా పోలేదని ఇటీవల కేసులు పెరుగుతుండడమే దానిని సూచిస్తోంది. కేరళలో కొత్త వేరియంట్ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు మళ్లీ ఆందోళన చెందుతున్నారు. రెండేళ్లుగా ఊసే లేకుండాపోయిన కరోనా మళ్లీ ఇప్పుడిప్పుడే విజృంభిస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచిస్తోంది.
ఇప్పటికే ప్రజలు మూడు వేరియంట్ల బారిన పడి అల్లాడిపోయారు. ముఖ్యంగా కరోనా తొలి రెండేళ్లలో మరణాల సంఖ్య విపరీతంగా ఉంది. అందులోనూ డిసెంబర్లో కేసుల సంఖ్య పెరిగింది. కోవిడ్ కొత్త ఉపరకం కేరళలో బయటపడింది. ఈ ఇన్ఫ్లుయెంజా లాంటి వ్యాధులను పరీక్షించి నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కోరింది. ఇదిలా ఉండగా.. ప్రపంచంలో ఆరోగ్య సంస్థ కోవిడ్ 19 కొత్త సబ్ వేరియంట్‌ను వేరియెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌గా వర్గీకరించింది. అయితే దీని వల్ల ప్రజలకు పెద్ద ముప్పు ఉండదని చెప్పింది. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు ఇతర వేరియంట్ల వల్ల సంభవించే వ్యాధి వ్యాప్త మరణాల నుంచి రక్షణ కల్పిస్తుందిని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.