Lifestyle: నాతో కలయిక ఇష్టం లేకపోయినా నటిస్తోంది అనిపిస్తోంది
Lifestyle: నాకు పెళ్లై ఐదేళ్లు అవుతోంది. ఒక పాప ఉంది. ఈ మధ్యకాలంలో కలయిక సమయంలో నా భార్య భావప్రాప్తి (ఆర్గాజం)ని ఫేక్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. తనకు సంతృప్తి లేకపోయినా సంతృప్తి చెందినట్లు నటిస్తోంది అనిపిస్తోంది. ఈ విషయం నన్ను చాలా ఒత్తిడికి గురిచేస్తోంది. ఏదన్నా సలహా ఇవ్వండి.
నిపుణుల సలహా: మీ భార్య కలయిక సమయంలో సంతృప్తిగా లేకపోయినా నటిస్తున్నానని మీతో చెప్పిందా? లేక మీకే అలా అనిపించిందా? ఒకవేళ మీకు అలా అనిపిస్తున్నట్లైతే మీ భార్యతో మనసు విప్పి నేరుగా మాట్లాడి చూడండి. తనకేమన్నా కలయిక సమయంలో ఇబ్బందిగా ఉందేమో తెలుసుకోండి. తనంతట తానే కలయిక కావాలని కోరుకుంటోంది అంటే మీది కేవలం అపోహే. ఒకవేళ తనకు నిజంగానే సమస్య ఉన్నట్లైతే వైద్యులను సంప్రదించడం మంచిది. ఎందుకంటే కలయిక అనేది ఒక అందమైన అనుభూతి. దానిని భార్యాభర్తలు కలిసి ఇష్టంతో ఆనందిస్తేనే మంచిది.