Lifestyle: ఈ వయసులో మామగారు అత్తగారిని మోసం చేస్తున్నారు
Lifestyle: నాకు నా అత్తింటివారంటే ఎంతో గౌరవం. వారిని నా కన్నవారిలాగే చూసుకుంటాను. వారు కూడా నా పట్ల అంతే ప్రేమ చూపిస్తారు. సంతోషంగా ఉన్న మా జీవితాల్లో ఓ పిడుగులాంటి వార్త నా చెవిన పడింది. ఈ వయసులో మా మామగారు వేరే స్త్రీతో ఉంటూ అత్తగారిని మోసం చేస్తున్నారని తెలిసింది. ఇది తెలిసినప్పటి నుంచి నాకు మనశాంతి లేదు. ఈ విషయం మా అత్తయ్యకు తెలిస్తే ఈ వయసులో ఆవిడ తట్టుకోగలదా? సలహా ఇవ్వగలరు.
నిపుణుల సలహా
ఇది నిజంగా బాధాకరం. అయితే.. మీకు ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? వారు చెప్పింది ముమ్మాటికీ నిజమా కాదా అని ముందు మీరు నిర్ధారించుకోండి. అది నిజం అని తేలితే ముందు మీ భర్తకు చెప్పండి. ఆ తర్వాత మీరు ఇద్దరూ కలిసి మీ మామగారితో మాట్లాడటానికి ఆస్కారం ఉంటుంది. మీ అత్తయ్యకు ఈ విషయం తెలిస్తే నిజంగానే ఆమె మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఆవిడకు మ్యాటర్ తెలీకుండా జాగ్రత్త పడాల్సింది మీరే. ముందు మీరు ఈ విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాత మీ మామయ్యతో మాట్లాడండి. ఆయన్ను కౌన్సిలింగ్‌కి తీసుకెళ్లినా మంచిదే.