Lifestyle: సెక్స్‌కి ముందు పోర్న్ చూడాలని ఫోర్స్ చేస్తున్నాడు
Lifestyle: నా భర్త నేను ఎప్పుడు కలయికలో పాల్గొనాలన్నా ఆయన నన్ను పోర్న్ చూడాలని బలవంతం చేస్తున్నాడు. ఆయనకు పోర్న్ చూస్తేనే మూడ్ వస్తుందట. నాకేమో నీరసం వస్తుంది. నాకు అలా అస్సలు నచ్చదు. ఈ విషయం ఆయనకు చెప్తే బాధపడతారేమో అని చెప్పడం లేదు. ఆయన బాధపడకుండా ఉండేలా నా సమస్య పరిష్కారం అయ్యే మార్గం ఉందా?
నిపుణుల సలహా
కలయిక అనేది ఇద్దరి ఇష్టాలతో జరగాల్సిన ప్రక్రియ. ఈ విషయం మీ భర్తకు అర్థమయ్యేలా చెప్పండి. అసలు కలయికకు పోర్న్ లాంటి అసహజ వీడియోలు చూడాల్సిన అవసరం ఏంటి? ఆయన పోర్న్ ఎందుకు చూస్తున్నట్లు? అందులో చెప్పేవి చూపించేవన్నీ నిజాలు అనుకుంటే చాలా పొరపాటు. కాకపోతే ముఖం మీదే నాకు ఆ వీడియోలు చూడటం ఇష్టం లేదు అని చెప్పేస్తే ఆయన నొచ్చుకుంటారు. కాబట్టి నాకు అవి చూడాలని లేదండీ.. అని కాస్త ప్రేమగానే చెప్పే ప్రయత్నం చేయండి. ఎంత చెప్పినా మీ వారు వినకపోతే కౌన్సిలింగ్ బెస్ట్ ఆప్షన్. కౌన్సిలింగ్‌కి తీసుకెళ్తే ఆ పోర్న్ చూసే దిక్కుమాలిన అలవాటును కూడా వారు మాన్పించే అవకాశం ఉంది.